మన నాలుక తెలిపే ఆరోగ్య రహస్యాలు

మనం సాదారణంగా డాక్టర్ దగ్గరకి వెళ్ళినప్పుడు రొటీన్ చెకప్ లో బాగంగా నాలుకను చూస్తారు.మన నాలుక మొత్తం మన ఆరోగ్యాన్ని చెప్పేస్తుంది.

 Secrets Your Tongue Reveals About Your Health-TeluguStop.com

నాలుకను చూసి అనేక రకాల వ్యాధులను ప్రాధమికంగా గుర్తించవచ్చు.నోటిలో చిగుళ్ళ తరువాత నాలుక మీదే ఎక్కువగా వ్యాధి కారకాలు నివసిస్తాయి.

అయినప్పటికీ నాలుక అనేది మన శరీరంలో ఎక్కువ నిర్లక్ష్యం చేసే అవయవాలలో ఒకటిగా ఉంది.నాలుక ఒక అంతర్గత అవయవం అయిన సరే, బాహ్య అవయవాలను ఏ విధంగా అద్దంలో చూసుకుంటామో అలాగే నాలుకను కూడా చూస్తూనే ఉంటాం.

నాలుక బహిర్గతం చేసే విషయాలను చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది.అనేక వ్యాధులను గుర్తించటంలో నాలుక ప్రత్యేకమైన పాత్రను పోషిస్తుంది.

అందువల్ల మనం నాలుకను ఆరోగ్యకరముగా నిర్వహించవలసిన బాధ్యత ఉంది.

ఇక్కడ నాలుక మీద లక్షణాల బట్టి వివిధ ఆరోగ్య సమస్యలను ఎలా గుర్తించవచ్చో చూద్దాం.

1.ముదురు ఎరుపు రంగు

సాదారణంగా ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి యొక్క నాలుక గులాబి రంగులో ఉంటుంది.నాలుక ముదురు ఎరుపు రంగులో ఉంటే, అది రక్తహీనత, కవాసాకి వ్యాధి మరియు స్కార్లెట్ జ్వరం వంటి వాటికి సంకేతంగా భావించాలి.

2.తెలుపు పాచెస్

సాదారణంగా నాలుక మీద తెల్లటి రంగులో, కాటేజ్ చీజ్ లాంటి పూత పాచెస్ గా ఏర్పడుతుంది.ఇది నోటి కాన్డిడియాసిస్ వ్యాధి అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటి.

ఇది నోటిలో ఈస్ట్ సంక్రమణ ద్వారా కలుగుతుంది.ఇది సాదారణంగా ముసలి వారు,పసి పిల్లల్లో రోగనిరోదక శక్తి తగ్గటం వలన ఏర్పడుతుంది.

3.అసాదారణ మృదుత్వం
నాలుక ఉపరితలం మీద చిన్న వెంట్రకల వంటి నిర్మాణాలు ఉండుట వలన నాలుక కరుకుగా ఉంటుంది.ఈ విధంగా మృదుత్వం కోల్పోయి కరుకుగా ఉన్న నాలుక అసాధారణంగా ఉంటుంది.ఈ పరిస్థితిలో ఉన్న నాలుకను కృశించిన నాలుక అంటారు.ఈ స్థితిలో నాలుక మంట మరియు నొప్పి ఉంటుంది.ఈ రకమైన పరిస్థితికి పోషక లోపంనకు సంబంధం ఉంది.

4.మందపాటి, పసుపు పూత

పశ్చిమ వైద్య ప్రకారం, నాలుక మీద ఒక మందమైన, పసుపు పూత అనేది బాక్టీరియా చర్య ఎక్కువగా ఉందని సూచిస్తుంది.నోటి పరిశుభ్రత లేకపోవటం, నోటి శ్వాస మరియు జ్వరం వంటి కారణాల వలన ఈ పరిస్థితి ఉంటే కొంత మంది గుండె రోగుల్లో స్ట్రోక్స్ ను ముందుగా గుర్తించవచ్చని తెలిసింది.

5.నొప్పి లేని పొక్కులు

నాలుక మీద నొప్పి లేని పొక్కులు రెండు వారాల కన్నా ఎక్కువ రోజులు ఉంటే కనుక అది నోటి క్యాన్సర్ ప్రారంభ సంకేతం కావచ్చు.ఈ చిన్న పొక్కులు తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే అవకాశం ఉంది.

అలాగే మీరు తీసుకున్న ఆహారం మింగటానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube