పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ అప్పుడే డీలా పడిపోయింది.తొలిరోజు భారి కలెక్షన్లతో బాక్సాఫీస్ ను కుదిపేసిన ఈ సినిమా, రెండొవరోజు ఒక్కసారిగా పడిపోయింది.
తొలిరోజు తెలుగురాష్ట్రాల కలెక్షన్లు 20కోట్ల మార్కుని టచ్ చేసి బాహుబలికి సవాలు విసిరితే… రెండొవరోజు 4-5కోట్లు కూడా అతికష్టం మీద రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం
ఇక హిందీ వెర్షన్ మరీ ఘోరం.మొదటిరోజు 45 లక్షలు వస్తే, రెండొవరోజు 20 లక్షల నెట్ వచ్చింది.65 లక్షల నెట్ అంటే షేర్ 30 లక్షల దాకా ఉండొచ్చు.కావాలని పరువు తీసుకున్నట్లు ఉంది ఈ హిందీ విడుదల.
ఇక అమెరికా సంగతి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.ఆదివారంతో అయినా మిలియన్ డాలర్ల వసూళ్ళు వస్తాయో లేదో చూడాలి
ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈరోజు మంచి ప్రారంభం లభించలేదు సినిమాకు.
ఎక్కువ రేట్లకు సినిమాను అమ్మడంతో ఈ స్పీడ్ ఏమాత్రం సరిపోదు నష్టాల నుంచి కాపాడడానికి.గట్టిగా మాట్లాడుకుంటే .భారి డిజాస్టార్ వైపుగా వెళుతోంది సర్దార్ గబ్బర్ సింగ్.