భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ మూవీ టీజర్‌ను సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.‘పవర్’ ఫేం బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.
పవన్ కళ్యాణ్ మరోసారి ఈ సినిమాలో పోలీస్‌గా కనిపించబోతున్న విషయం తెల్సిందే.ఇప్పటికే భారీ అంచనాలున్న ఈ సినిమా క్రేజ్‌ను మరింతగా పెంచేందుకు టీజర్‌ను ఆసక్తికరంగా కట్ చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
మరి కొన్ని గంటల్లోనే ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ టీజర్‌ను విడుదల చేసే అవకాశాలున్నాయి.ఇప్పటికే టీజర్‌కు పవన్ ఓకే చెప్పాడని, ప్రస్తుతం తుది మెరుగులు దిద్దే పనిలో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నట్లుగా మెగా సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది.
కాజల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు శరత్ మారార్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న విషయం తెల్సిందే.పవన్ కళ్యాణ్ కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
ఇదే సంవత్సరం చివర్లో ఈ సినిమాను విడుదల చేసేలా దర్శకుడు బాబీ ప్లాన్ చేస్తున్నాడు.