వామ్మో ! సర్దార్ గబ్బర్ సింగ్ కి హిందీలో అంత నష్టమా?

ఏరోజైతే సర్దార్ గబ్బర్ సింగ్ హిందీలో విడుదల చేస్తున్నామని ప్రకటించారో, ఆరోజు నుంచి ఈ అలోచనను ఎంకరేజ్ చేసిన పాపాన పోలేదు ఎవరు.బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా స్థాయి పెరిగింది.

 Sardaar – Biggest Disaster Ever In Dubbing Films-TeluguStop.com

ఇలాంటి సమయంలో హిందీలోకి ఒక తెలుగు సినిమా వెళ్ళాలంటే బాహుబలి రేంజిలో పేరు సంపాదించక్కరలేదు కాని, బాహుబలి పేరు చెడగొట్టకుంటే చాలు అనేది ట్రేండ్ పండితుల అభిప్రాయంగా కనబడింది.అందుకే సర్దార్ గబ్బర్ సింగ్ హిందీలో విడుదల చేయడం మూర్ఖపు నిర్ణయం అని రామ్ గోపాల్ వర్మ కూడా అభిప్రాయపడ్డారు.

చివరకి అనుకున్నదే జరిగుతోంది.సర్దార్ గబ్బర్ సింగ్ ని తీవ్రంగా తిరస్కరించారు హిందీ జనాలు.

తొలిమూడు రోజుల్లో దాదాపు కోటి రూపాయల నెట్ వసూలు చేసింది సర్దార్ హిందీలో.ఫర్వాలేదనిపించే కలెక్షనే అయినా, ఇది డబ్బింగ్ చిత్రాల చరిత్రలో అతిపెద్ద డిజాస్టర్ గా నిలువబోతోంది.

ఎందుకంటే … నమ్మశక్యంకాని విధంగా 12కోట్ల రూపాయలకు హిందీ హక్కులని సొంతం చేసుకుంది ఏరోస్ ఇంటర్నేషనల్.దీనికి అదనంగా మరో నాలుగు కోట్లు పబ్లిసిటి మీద పెట్టారు.

ప్రమోషన్స్ అంతలా చేశారు కాబట్టే ఈ కోటి రూపాయల నెట్ అయినా వచ్చింది.

నెట్ కోటి రూపాయలు అంటే 50 లక్షలకు అటూఇటుగా ఉంటుంది షేర్.

అంటే పదహారు కోట్లు హిందీలో ఖర్చుపెడితే వెనక్కి కోటిరూపాయలు కూడా వచ్చేలా లేవు.ఇక నష్టమెంతో ప్రత్యేకంగా మేము లెక్క కట్టి చెప్పనక్కరలేదు అనుకుంటా!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube