అందగాడ్ని కాదు, అమ్మాయిలు ఇలాంటివాడిని ఇష్టపడతారు

హృతిక్ రోషన్, మహేష్ బాబు లాంటి అందగాళ్ళంటే ప్రతి అమ్మాయికి ఇష్టమే.కాని ప్రతీ అమ్మాయి అలాంటి అందగాళ్ళనే కోరుకోదు.

 Sarcastic And Firm Speech – Women Prefer Such Boys-TeluguStop.com

అబ్బాయి అందంగా ఉంటే అది బోనస్ అనుకుంటారు తప్పా, అందగాడు మాత్రమే కావలి అని అనుకోరు.ఇంతకి అమ్మాయిలకు కావాల్సిన మొదటి లక్షణం ఏంటో చూద్దాం.

ఒక యూట్యూబ్ ఛానెల్ బెంగళూరు అమ్మాయిల మీద చేసిన చిన్న సర్వేలో అమ్మాయిలి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.అమ్మాయిలకు కలిగే అతిపెద్ద ఆకర్షణ అబ్బాయి మాటతీరే అంట.సరదాగా, కామెడిగా, ఉల్లాసంగా మాట్లాడే అబ్బాయిలంటే అమ్మాయిలకి పిచ్చి ఇష్టం.క్లుప్తంగా చెప్పాలంటే, అబ్బాయితో మాట్లాడుతుంటే అమ్మాయి మొహంలో ఆటోమేటిక్ గా నవ్వు రావాలి.

వీడితో రోజు కాసేపైనా మాట్లాడితే ఎంత బాగుంటుందో అనే భావన అమ్మాయికి వచ్చిందంటే మీ పని అయిపోయినట్టే, దానికి తోడు మీరు అందంగా ఉంటే, మీ ప్రేమలో అమ్మాయిని పడకుండా ఎవ్వరు ఆపలేరు.అందుకే, మాటుతీరుని ఆకర్షణీయంగా మలచుకోండి.

ఇక తడబడుతూ, ముభావంగా మాట్లాడే అబ్బాయిలు అమ్మాయిలపై ఆశలు పెట్టుకోవడం పెద్దగా మంచిది కాదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube