గత కొంత కాలంగా టాలీవుడ్లో వెరైటీ సినిమా టైటిల్స్ పుట్టుకు వస్తున్నాయి.టైటిల్‌తోనే సినిమాపై అంచనాలు పెంచాలని కొందరు ఆలోచిస్తుంటే, మరి కొందరు సినిమా గురించి ప్రేక్షకులు ఆలోచించేలా టైటిల్‌ను పెడుతున్నారు.
తాజాగా మెగా హీరో అల్లు అర్జున్ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ అంటూ కాస్త కొత్త టైటిల్‌తో వచ్చాడు.ఇక బన్నీ ప్రస్తుతం నటిస్తున్న బోయపాటి శ్రీను చిత్రానికి మరింత విచిత్రమైన టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.
బన్నీ, బోయపాటిల కాంబినేషన్లో సినిమాకు పలు టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.కాని చివరకు ‘సరైనోడు’ అనే టైటిల్‌కు చిత్ర యూనిట్ సభ్యులు ఫిక్స్ అయినట్లుగా సమాచారం అందుతోంది.
‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మరింత మాస్ టైటిల్ ఉంటుందని అంతా భావించారు.కాని అందరిని ఆశ్చర్యపర్చుతూ ఈ సినిమాకు టైటిల్‌ను క్లాస్ టచ్ ఉండేలా ‘సరైనోడు’ అంటూ పెట్టాడు.
త్వరలోనే ఈ టైటిల్‌ను అల్లు అరవింద్ గీతాఆర్ట్స్ బ్యానర్లో రిజిస్ట్రర్ చేయించే అవకాశాలున్నాయి.