Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

నగ్న వీడియో లీక్ అయిన హీరోయిన్ పరిస్థితి దారుణంగా తయారయ్యింది-Sanchita Is Having Hard Time Mentally After Leaked Nude Video

మన వ్యక్తిగత విషయం నలుగురికి తెలిసినా పరువు పోయింది అంటూ ఓ మూలన బాధపడుతూ కూర్చుంటాం. అలాంటిది ఓ సినీనటి నగ్న విడియో బయటపడితే తను ఎంత బాధపడాలి? కోట్ల మందికి ఆ విడియో చేరుతుంది. కోట్ల మంది దాని గురించి మాట్లాడుకుంటారు.

సంచిత శెట్టి. తమిళనాట మంచి పేరున్న నటి. సూదు కవ్వం లాంటి భారి హిట్ తో పాపులర్ హీరోయిన్ గా మారింది. ఇప్పుడు కూడా చేతిలో మూడు సినిమాలున్నాయి. కాని ముఖంలో సంతోషం కరువైంది. లీక్ అయిన వీడియో తనది కాదు అని చెప్పాలి కాబట్టి చెప్పింది కాని, ఆ వీడియో తనదే జనాలకి స్పష్టంగా అర్థమయిపోయింది.

ఆ విడియోని బయటపెట్టింది నిజంగా సింగర్ సుచిత్రేనా కాదా అనేది తరువాతి విషయం. ఎవరు చేసినా, అలా ఒకరి వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్ లోకి, ముఖ్యంగా జనాలకి తెలిసిన ఒక అమ్మాయి నగ్న వీడియోని ట్విట్టర్ లో పెట్టడం చాలా పెద్ద తప్పు. విడియో బయటపడ్డప్పటి నుంచి సంచిత మానసికంగా కృంగిపోయిందట. ఇకనుంచి అవకాశాలు రావడం, రాకపోవడం వేరే విషయం, సినిమా ఫిల్డ్ కాకపోతే, ఏదైనా ఉద్యోగం చేసుకోనైనా బ్రతికేయవచ్చు. కాని తన విడియో ఎప్పటికీ ఉండిపోతుంది. దాని గురించి జనాలు ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటారు.

ఇంట్లో వాళ్ళతో ఎలా మాట్లాడాలో, స్నేహితులతో ఎలా మాట్లాడాలో, తెలిసినవారితో ఎలా మాట్లాడాలో, అసలు తన గురించి ఇప్పుడు వీళ్ళంతా ఏమని మాట్లాడుకంటున్నారో … ఎన్ని ఆలోచనలు మెదులుతున్నాయో పాపం సంచిత మనసులో!

Continue Reading
To Top