బిగ్ బాస్ మధ్యలో వదిలినందుకు సంపూకి కట్టే జరిమానా ఎంతో తెలుసా

బిగ్ బాస్ షో మొదలైనరోజు అక్కడ ఎన్టీఆర్ తరువాత అతిపెద్ద స్టార్ ఎవరు అంటే అది సంపూర్నేష్ బాబే.సంపూ బిగ్ బాస్ ఇంట్లోకి వస్తున్నాడు అని తెలియగానే అందరిలో ఎదో ఆసక్తి.

 Sampoornesh To Pay Huge Fine For Leaving Bigg Boss-TeluguStop.com

వారాంతం ఎన్టీఆర్ ఉంటాడు, ఇక ఆ అయిదురోజులు సంపూ చేసే సందడితో బిగ్ బాస్ హౌస్ కళకళలాడిపోతుంది, టీఆర్పీ మోత మోగిపోతుంది అని అంతా ఆశపడ్డారు.కాని అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి.

సంపూ అలరించడం పక్కన పెడితే తుస్సుమన్నాడు.షోని బోర్ కొట్టించాడు.

అసలు కెమెరా ముందు చెలరేగిపోయి డైలాగులు చెప్పే సంపూ బిగ్ బాస్ కెమెరా ముందు ఏంటి ఇలా అయిపోయాడు అంటూ అంతా ఆశ్చర్యపోయారు.ఎన్టీఆర్ ఏరికోరి మరి తెచ్చుకుంటే పూర్తిగా డిజపాయింట్ చేసాడు.

నేను వెళ్ళిపోతా, వెళ్ళిపోతా అంతో ఏడవటం అటు ఉంచితే, నన్ను పంపించకపోతే బిగ్ బాస్ ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.

ఇక తప్పనిసరి పరిస్థితుల్లో సంపూని షోలోంచి పంపించేయడం జరిగింది.

ఆ రకంగా ఎలిమినేషన్ ప్రాసెస్ ని చూడకుండానే వెళ్ళిపోయిన మొదటి బిగ్ బస్ కాంటెస్ట్టెంట్ గా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు సంపూ.కాని దీనివల్ల లక్షల్లో నష్టపోతాడు.

బిగ్ బాస్ అలాంటి ఇలాంటి షో కాదు.చాలా స్ట్రిక్ట్.

మోపెడు రూల్స్ ఉంటాయి.అవి పాటించకపొతే న్యాయపరంగా కఠిన చర్యలే.

మొన్న డ్రగ్స్ కేసులో ముమైత్ ఖాన్ సిట్ ముందు హాజరైతే, తన వెంటే నీడలా ఉన్నాడు బిగ్ బాస్ ప్రతినిధి.అంటే ఇంటి బయటకి వెళ్ళినా, బిగ్ బాస్ కంట్రోల్ లోనే ఉండాలి అన్నమాట.

ఓరకంగా చెప్పాలంటే, ఆ 70 రోజులు వారి జీవితాలు వారివి కావు.ఏం చేయాలన్నా బిగ్ బాస్ అనుమతి కావాల్సిందే.

మరి అలాంటి బిగ్ బాస్ రూల్స్ ఉల్లఘించిన సంపూర్నేష్ ని ఊరికే వదిలేస్తాడా ?

ఉన్న వారం పది రోజుల్లో సంపూ బిగ్ బాస్ మేకర్స్ నుంచి సంపాదించింది పది లక్షలు.ఒప్పందం ప్రకారం, సంపూకి ఉన్న కొద్దిరోజుల్లోనే పది లక్షలు వచ్చాయి.

అదే సంపూ షో చివరి దాకా ఉండుంటే, 70-80 లక్షలు తీసుకెళ్ళేవాడు.ఒకవేళ షో గెలిచి ఉంటే ఇంకా ఎక్కువ ఎమౌంట్ వచ్చేది.

కాని రూల్స్ వదిలేసి మధ్యలో వెళ్ళిపోవడం వలన సంపూకి ఇరవై లక్షల జరిమానా పడిందట.అంటే తాను సంపాదించుకున్న పది లక్షలతో పాటు, మరో పది లక్షలు ఎక్కువ కలిపి మళ్ళీ బిగ్ బాస్ చేతిలోనే పెట్టాలి.

ఇప్పుడు బిగ్ బాస్ షో వలన సంపూ సంపాదించింది ఏమిటి ? కేవలం తన ఇమేజ్ కి డ్యామేజ్.పోగొట్టుకున్నది పది లక్షలు.

మరోవైపు ధన్ రాజ్, ముమైత్ ఖాన్ దూసుకేళ్తున్నారు.ప్రజల అభిమానం పొందుతున్నారు.

ఎవరికి తెలుసు ? బిగ్ బాస్ ఇంట్లోంచి బయటకి రాగానే వీరి ఇమేజ్ ఇంకా పెరుగుతుందేమో, అవకాశాలు కూడా పెరుగుతాయేమో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube