సంపూ డైలాగ్స్‌ అదుర్స్‌

బర్నింగ్‌స్టార్‌ సంపూర్నేష్‌బాబు ‘హృదయ కాలేయం’ సినిమా తర్వాత నటిస్తున్న సినిమా ‘సింగం 123’.ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం చివరి దశలో ఉంది.

 Sampoornesh Babu Super Dialogues In Singam 123-TeluguStop.com

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.ఈ ట్రైలర్‌లో బర్నింగ్స్‌ స్టార్‌ తన స్టామినాను మరోసారి రుజువు చేసుకున్నాడు.

పోలీస్‌గా సంపూ పలికిన డైలాగ్స్‌ సూపర్బ్‌గా ఉన్నాయంటూ టాక్‌ వినిపిస్తోంది.భారీ డైలాగ్స్‌ను పవర్‌ ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా సంపూ చెప్పిన తీరుకు సినీ ప్రముఖులు సైతం ఆశ్చర్య పోతున్నారు.

‘నీకు బీపీ వస్తే నీ చెంచా గాళ్లు భయపడతారేమో.నాకు బీపీ వస్తే ఏపీ, తెలంగాణ, రాయలసీమ, కేరళ, బీహార్‌, కర్ణాటక దేశం మొత్తం వణుకుద్ది… రేసులో నన్ను అందుకోవడానికి నేను రేసుగుర్రంను కాదు.

రెడ్‌ బుల్‌ తాగిన సింహాన్నిరా.అంటూ సంపూ చెప్పిన డైలాగ్స్‌కు సినీ జనాల్లో సినిమాపై అంచనాలు భారీగా పెరిగి పోతున్నాయి.

మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ సినిమాకు అజయ్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.పలు సినిమాల్లోని పోలీస్‌ సన్నివేశాలను ఈ సినిమాలో పేరడీ చేస్తున్నట్లుగా గతంలోనే మంచు విష్ణు ప్రకటించిన విషయం తెల్సిందే.

ఈ సినిమాను త్వరలోనే విడుదల చేసే అవకాశాలున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube