Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

మహేష్ ఇక మారడు అంతే ... బోర్ కొట్టిస్తున్నాడు-Same Routine Mahesh Babu Disappoints Again

ఆర్యలో ఉన్న అల్లు అర్జున్ కి, ఇప్పుడున్న అల్లు అర్జున్ కి ఎంత తేడా? సినిమా సినిమాకి తన లుక్స్ లో వేరియేషన్ చూపించడం అల్లు అర్జున్ కి అలవాటు. అయితే హేయిర్ స్టయిల్ మార్చేస్తాడు, గడ్టం తగ్గిస్తాడు, పెంచేస్తాడు, కేవలం మీసకట్టు (సరైనోడు) తో కనిపిస్తాడు, ఇలా తన లుక్స్ మీద ప్రయోగాలు చేస్తుంటాడు. ఎన్టీఆర్ ఒకప్పుడు ఇలా ఉండేవాడు కాదు కాని యమదొంగలో మార్పు సాధించి, టెంపర్ నుంచి సినిమాకో లుక్ మార్చేస్తున్నాడు. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, ఇప్పుడు జై లవ కుశ .. అసలు సంబంధం లేని లుక్స్. రామ్ చరణ్ కూడా చిరుత, మగధీర, ఆరెంజ్, ధృవ సినిమాల్లో కొత్త కొత్త లుక్స్ ట్రై చేసాడు. ఇక ప్రభాస్ కూడా మిస్టర్ పెర్ఫెక్ట్, బుజ్జిగాడు, మున్నా, బాహుబలి, సాహో, మిర్చి .. ఈ సినిమాలన్నిటిలో కొత్త లుక్స్ సెలెక్ట్ చేసుకున్నాడు.

ఇలా లుక్స్ లో కొత్తదనం తీసుకురాకుండా, ఎప్పుడు రోటీన్ గా వెళ్ళే టాప్ హీరోలు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ మాత్రమే. మధ్యలో మహేష్ పోకిరి, అతిథిలో, పవన్ జాని, పంజాలో .. ఈ సినిమాలు మినహాయిస్తే ఎప్పుడూ ఒకేరకమైన స్టయిల్ ని మేయింటేన్ చేస్తున్నారు. ఆ లుక్స్ ఎంత రొటీన్ గా ఉంటాయంటే ఒక్కోసారి ఏ స్టిల్ ఏ సినిమాలోదో గుర్తుపట్టడం కూడా కష్టం. ఇంత బద్ధకం ఎందుకో మరి.

భరత్ అనే నేనులో మహేష్ లుక్ డిఫరెంట్ గా ఉంటుందని, సూపర్ స్టార్ కొత్తగా కనిపిస్తాడని, మహేష్ గడ్డం పెంచబోతున్నాడని అన్నారు. కాని అలాంటిదేమి జరగట్లేదని భరత్ అనే నేను సెట్స్ నుంచి లీక్ అయిన స్టిల్స్ చూస్తే అర్థమయిపోయింది. మీరే చూడండి మహేష్ లుక్ లో ఏమైనా మార్పు ఉందో! స్పైడర్ లో ఎలా ఉన్నాడో, ఇందులోనూ అలానే ఉన్నాడు. దీంతో మరోసారి మహేష్ అభిమానలు చల్లబడ్డారు. మహేష్ ఇక ఇంతే, మారే అవకాశం లేదేమో అని సర్దుకున్నారు.

ప్రస్తుతం భరత్ అనే నేను షూట్ లో ఉన్న ప్రిన్స్, జులై 5 నుంచి మళ్ళీ స్పైడర్ టీమ్ లో జాయిన్ అవుతాడు. బ్యాలెన్స్ గా ఉన్న రెండు పాటలు, ఓ చిన్న సన్నివేశం తీసేసి సినిమా పూర్తి చేస్తారట. మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ తెలుగు – తమిళ సినిమా దసరా కానుకగా రానుండగా, కొరటాల శివ రూపొందిస్తున్న భరత్ అనే నేను జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Continue Reading
More Posts
To Top