టాప్ 3 హీరోలతో సమంత అరుదైన రికార్డు

సమంతని గొల్డెన్ లెగ్ అని అనవచ్చు.ఎందుకంటే ఈ బ్యూటి కెరీర్లో విజయాల శాతమే ఎక్కువ.

 Samantha’s Rare Record With Top – 3 Heroes-TeluguStop.com

వచ్చిరావడంతోనే ఏం మాయ చేసావే, బృందావనం, దూకుడు లాంటి విజయాలను రుచి చూసిన సమంత, ఇప్పుడు మరో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకుంది.అదేటంటే, టాప్ 3 హీరోలైన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ ల బిగ్గేస్ట్ హిట్స్ లో హీరోయిన్ గా ఉండటం.

మీరే గమనించండి … సమంత మహేష్ బాబుతో చేసిన దూకుడు రికార్డుల మోత మోగించింది.అప్పటికి మహేష్ కెరీర్లో అతిపెద్ద హిట్ గా, మగధీర తరువాత రెండోవ అతిపెద్ద గ్రాసర్ గా నిలిచింది.

ఇదే సమంత పవన్ కళ్యాణ్ తో చేసిన అత్తారింటికి దారేది ఆ సమయంలో ఇండస్ట్రీ హిట్.ఇప్పటికి పవన్ కి టాప్ గ్రాసర్ ఇదే.

ఇక ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ కూడా దూకుడు, అత్తారింటికి దారేది లాంటి ఫలితమే.బాహుబలి, శ్రీమంతుడు చిత్రాల తరువాత బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ చిత్రం, ఎన్టీఆర్ కెరీర్లో అతిపెద్ద హిట్.

ఈ ఘనత సమంతకి తప్ప మరో హీరోయిన్ కి దక్కలేదు.శృతిహాసన్ నటించిన గబ్బర్ సింగ్, శ్రీమంతుడు పవన్, మహేష్ కెరీర్లో బిగ్గెస్ట్ గా నిలిచినా, శృతి ఎన్టీఆర్ తో అలాంటి బ్లాక్బస్టర్ ని ఎన్టీఆర్ తో సాధించలేకపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube