టాప్ 3 హీరోలతో సమంత అరుదైన రికార్డు-Samantha’s Rare Record With Top – 3 Heroes 3 months

Dookudu Janatha Garage Mahesh Babu Ntr Pawan Kalyan Samantha Ruth Prabhu Three Biggest Hits టాప్ 3 హీరోలతో సమంత అరుదైన రికార్డు Photo,Image,Pics-

సమంతని గొల్డెన్ లెగ్ అని అనవచ్చు. ఎందుకంటే ఈ బ్యూటి కెరీర్లో విజయాల శాతమే ఎక్కువ. వచ్చిరావడంతోనే ఏం మాయ చేసావే, బృందావనం, దూకుడు లాంటి విజయాలను రుచి చూసిన సమంత, ఇప్పుడు మరో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకుంది. అదేటంటే, టాప్ 3 హీరోలైన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ ల బిగ్గేస్ట్ హిట్స్ లో హీరోయిన్ గా ఉండటం.

మీరే గమనించండి … సమంత మహేష్ బాబుతో చేసిన దూకుడు రికార్డుల మోత మోగించింది. అప్పటికి మహేష్ కెరీర్లో అతిపెద్ద హిట్ గా, మగధీర తరువాత రెండోవ అతిపెద్ద గ్రాసర్ గా నిలిచింది. ఇదే సమంత పవన్ కళ్యాణ్ తో చేసిన అత్తారింటికి దారేది ఆ సమయంలో ఇండస్ట్రీ హిట్. ఇప్పటికి పవన్ కి టాప్ గ్రాసర్ ఇదే.

ఇక ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ కూడా దూకుడు, అత్తారింటికి దారేది లాంటి ఫలితమే. బాహుబలి, శ్రీమంతుడు చిత్రాల తరువాత బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ చిత్రం, ఎన్టీఆర్ కెరీర్లో అతిపెద్ద హిట్. ఈ ఘనత సమంతకి తప్ప మరో హీరోయిన్ కి దక్కలేదు. శృతిహాసన్ నటించిన గబ్బర్ సింగ్, శ్రీమంతుడు పవన్, మహేష్ కెరీర్లో బిగ్గెస్ట్ గా నిలిచినా, శృతి ఎన్టీఆర్ తో అలాంటి బ్లాక్బస్టర్ ని ఎన్టీఆర్ తో సాధించలేకపోయింది.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. బాహుబలి పుట్టకముందు ఏం జరిగిందో తెలుసుకోవాలా?

About This Post..టాప్ 3 హీరోలతో సమంత అరుదైన రికార్డు

This Post provides detail information about టాప్ 3 హీరోలతో సమంత అరుదైన రికార్డు was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Samantha Ruth Prabhu, three Biggest hits, Pawan Kalyan, Mahesh Babu, Ntr, Dookudu, Attarintiki daredi, janatha garage, టాప్ 3 హీరోలతో సమంత అరుదైన రికార్డు

Tagged with:Samantha Ruth Prabhu, three Biggest hits, Pawan Kalyan, Mahesh Babu, Ntr, Dookudu, Attarintiki daredi, janatha garage, టాప్ 3 హీరోలతో సమంత అరుదైన రికార్డుAttarintiki daredi,dookudu,Janatha Garage,Mahesh Babu,ntr,Pawan Kalyan,samantha ruth prabhu,three Biggest hits,టాప్ 3 హీరోలతో సమంత అరుదైన రికార్డు,,