సమంతను నలిపేసిన ఫ్యాన్స్..!

సెలబ్రిటీలు వస్తున్నారంటే ఆ ప్రాంతంలో ఉండే హడావిడి వేరేలా ఉంటుంది.తమ అభిమాన నటీనటులను తెర మీద కన్నా డైరెక్ట్ గా చూడాలన్న అత్యుత్సాహంతో సెలబ్రిటీస్ వస్తున్నారన్న వార్త తెలియగానే అన్ని పనులు పోస్ట్ పోన్ చేసుకుని వారి కోసం నిరీక్షిస్తారు.

 Samantha Unsecured About Fans Behavior-TeluguStop.com

వి కేర్ సరికొత్త షోరూం ఓపెన్ చేసేందుకు మధురై వెళ్లిన సమంతకు ఫ్యాన్స్ చుక్కలు చూపించారట.సమంత కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఆమె వచ్చినప్పుడు చూడాలి మాట్లాడాలని ఒకేసారి మీద పడబోయారట.

సెక్యురిటీ వల్ల సమంత షాప్ లోకి ఎలాగోలా వెళ్లింది.

అయితే రిటర్న్ లో మాత్రం సమంత ఫ్యాన్స్ ఉత్సాహాన్ని ఆపలేకపోయింది.

కనీసం ఆమెను కార్ కూడా ఎక్కనివ్వకుండా కొందరు ఆకతాయిలు మీద మీద పడసాగారట.ఇక కొందరైతే అక్కడ ఉన్న స్పీకర్స్ ను బద్దలు కొట్టడం, సమంత కార్ పంక్చర్ చేయడం చేశారట.

పరిస్థితి కాస్త శృతి మించడంతో వెంటనే అక్కడ పోలీస్ వారికి ఇన్ ఫర్మేషన్ ఇవ్వగా వారు రంగంలోకి దిగి అంతా సెట్ చేశారు.సో అలా ఫ్యాన్స్ మధ్యలో సమంత నలిగిపోయిందన్నమాట.

షాప్ ఓపెనింగ్ చేస్తే డబ్బులు వస్తాయన్న ఆలోచనతో చేస్తున్న ప్రతి ఒక్క సెలబ్రిటీ అభిమానులు చేస్తున్న ఈ రచ్చకు ఎంతో కొంత ఇన్సెక్యూర్ ఫీలింగ్ లో ఉన్నారన్నది వాస్తవం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube