అదంతా అబద్ధమే అంటున్న సమంత -Samantha Says NO To Pawan Kalyan 1 month

 Photo,Image,Pics-

గత మూడు త్రివిక్రమ్ సినిమాల్లానే, మన మాటల మాంత్రికుడు పవన్ కళ్యాణ్ తో మొదలుపెట్టబోయే సినిమాకి కూడా సమంతానే హీరోయిన్ అని నిన్నటికి నుంచి తెగ వార్తలొస్తున్నాయి. దాంతో పవన్ అభిమానులు కూడా అత్తారింటికి దారేది కాంబినేషన్ రిపీట్ కాబోతోందని సంబరపడ్డారు. కాని అలాంటిదేమి జరగట్లేదు.

ఈ వార్తలన్ని అబద్ధలే అని సమంత తేల్చిపారేసింది. అవును, సమంత ఈ సినిమాలో హీరోయిన్ కాదంట. నిజానికి హీరోయిన్ గా ఇంకా ఎవరిని అనుకోలేదని యూనిట్ వర్గాలు తెలిపాయి. అంతేకాదు, మీడియా ప్రచారం చేస్తున్నట్లు ఈ సినిమా టైటిల్ కూడా “దేవుడే దిగి వచ్చినా” కాదంట. ఇంకా టైటిల్ కూడా నిర్ణయించలేదు.

నవంబరు 5వ తేదిన ఈ సినిమాకి సంబంధించి పూజ కార్యక్రమాలు జరుగుతాయి. అనిరుధ్ సంగీతం అందించబోయే ఈ భారి బడ్జెట్ చిత్రాన్ని ఎస్. రాధకృష్ణ నిర్మిస్తారు.


About This Post..అదంతా అబద్ధమే అంటున్న సమంత

This Post provides detail information about అదంతా అబద్ధమే అంటున్న సమంత was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Samantha, Rumors, Pawan - Trivirkam Film, Music Anirudh, Atharintiki Daaredi Combination, అదంతా అబద్ధమే అంటున్న సమంత

Tagged with:Samantha, Rumors, Pawan - Trivirkam Film, Music Anirudh, Atharintiki Daaredi Combination, అదంతా అబద్ధమే అంటున్న సమంత,Telugu Topi Com