టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంత కాలంగా తమిళ సినిమాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ వస్తుంది.తెలుగులో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ఇటీవలే మహేష్‌బాబు ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో ఎంపిక అయ్యింది.
తాజాగా మరో తెలుగు సినిమాకు ఈమె కమిట్ అయ్యింది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కబోతున్న సినిమాలో సమంత హీరోయిన్గా నటించబోతుంది.
స్టార్ హీరోయిన్ అయిన సమంత చిన్న హీరోతో నటించేందుకు పెద్ద పారితోషికాన్ని తీసుకుంటుంది.ఈమె ఏకంగా కోటిన్నర రూపాయల పారితోషికాన్ని నితిన్‌తో నటించేందుకు తీసుకోబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
‘అల్లుడు శీను’ సినిమాలో కొత్త హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో నటించినందుకు ఈమె రెండు కోట్ల పారితోషికం తీసుకుంది.ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ స్థాయిలో పారితోషికాన్ని తీసుకుంటుంది.
త్వరలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించబోతున్నారు.త్రివిక్రమ్ వరుసగా మూడవ సారి సమంత జత కట్టబోతుంది.