జీవితంలో మొదటిసారంటున్న సమంత

టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలుగుతున్న సమంత, తాజాగా సొంత భాష తమిళంలో కూడా తన సత్తా చాటుతోంది.గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌ కంటే కోలీవుడ్‌పైనే ఎక్కువ ఫోకస్‌ పెడుతున్న ఈ అమ్మడు ప్రస్తుతం విక్రం సరసన ‘10 ఎన్రాదుకుళ్ల’ అనే సినిమాలో నటిస్తుంది.

 Samantha Plays The Toughest Role In Her Career-TeluguStop.com

ఆ సినిమా కోసం సమంత గతంలో ఎప్పుడు లేని విధంగా కష్టపడుతున్నట్లుగా చెప్పుకొచ్చింది.కెరీర్‌ ప్రారంభించిన ఇన్నాళ్లకు కష్టం అంటే ఏంటో ఈ సినిమా ద్వారా ఈ అమ్మడికి అర్థం అవుతున్నట్లుగా తమిళ సినీ వర్గాల వారు అంటున్నారు.

విక్రం సినిమాలు అంటేనే వైవిధ్యానికి మరోపేరు.విక్రం గతంలో చేసిన ఎన్నో సినిమాలు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాయి.

తాజాగా ఆయన చేస్తున్న ఈ ‘10 ఎన్రాదుకుళ్ల’ సినిమా కూడా అలాంటి కోవకు చెందిందే అంటున్నారు.ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది.

కొంత డిఫరెంట్‌గా కూడా హీరోయిన్‌ పాత్ర ఉంటుంది.అందుకే హీరోయిన్‌గా నటిస్తున్న సమంత చాలా కష్ట పడుతున్నట్లుగా చెబుతోంది.

తాజాగా ఈ అమ్మడు తాను జీవితంలో మొదటిసారి ఇంతగా కష్టపడుతున్నాను అంటూ ట్విట్టర్‌లో ట్వీట్‌ చేసింది.ఈ సినిమాతో తమిళంలో మరో మెట్టును సమంత ఎక్కనుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube