త్రివిక్రమ్ ఇక సమంతాను వదలడు

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దీ సపరేట్ రూటు.తరుణ్, నితిన్ లాంటి చిన్నహీరోలను పక్కన పెడితే, టాప్ హీరోల్లో తీసినవారితోనే సినిమాలు తీస్తూ ఉంటారు ఆయన.

 Samantha In Surya – Trivikram Film?-TeluguStop.com

మహేష్, పవన్, అల్లు అర్జున్, చేసిన ముగ్గురు టాప్ హీరోలతో రెండేసి సినిమాలు చేసారు .ఇప్పుడు తొలిసారి తమిళ టాప్ హీరో సూర్యతో ఓ సినిమా మొదలుపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక హీరోయిన్లను కుడా రిపీట్ చేస్తూ ఉంటారు ఆయన.జల్సా తరువాత జులాయిలో ఇలియానానే తీసుకున్న త్రివిక్రమ్, అత్తారింటికి దారేది నుంచి మొదలు, సమంతాని వదలడం లేదు.అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, ఇప్పుడు అ.ఆ , ఇలా వరుసగా మూడు చిత్రాల్లో సామ్ ని తీసుకున్న ఈ మాటల మాంత్రికుడు, సూర్యతో చేయబోయే సినిమాకి కూడా హీరోయిన్ గా సమంతానే అనుకుంటున్నాడంట.

అంతా అనుకున్నట్టే జరిగితే, సమంతాకి ఇది త్రివిక్రమ్ తో నాలుగొవ సినిమా, సూర్యతో రెండొవ సినిమా అవుతుంది.ఇంతకు ముందు సూర్య సమంత కలిసి అంజాన్ లో నటించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube