తెలుగులో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెళిగిన సమంత తన సొంత భాష అయిన తమిళంలో రాణించేందుకు మొన్నటి వరకు చాలా కష్టపడాల్సి వచ్చింది.అయితే ఇప్పుడు ఆమె తమిళంలో కూడా వరుస విజయాలతో దూసుకు పోతుంది.
ప్రస్తుతం ఈమె తమిళంలో రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లో నటిస్తోంది.అందులో మొదటిది ధనుష్ సరసన ‘వీఐపీ 2’లో ఒకటి కాగా రెండవది తమిళ స్టార్ హీరో విక్రమ్ తాజా చిత్రం ‘10 ఎంద్రతుకుల్లా’.
ప్రముఖ దర్శకుడు మురుగదాస్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం తమిళ ఆడియన్స్ భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు.
తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ ట్రైలర్ విడుదల అయ్యింది.
భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కినట్లుగా ట్రైలర్‌ను చూస్తుంటే తెలుస్తోంది.ప్రముఖ దర్శకుడు విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై సమంత చాలా ఆశలే పెట్టుకుంది.
ఇప్పటి వరకు పెద్దగా ప్రాముఖ్యత లేని పాత్రల్లో నటించిన సమంత మొదటి సారి కథలో ట్రావెల్ అయ్యే పాత్రతో ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.నటిగా తప్పకుండా తమిళ ఆడియన్స్ ముందు తాను ఏంటో నిరూపించుకుంటాను అంటూ సమంత నమ్మకంతో ఉంది.
ఈ సినిమా విజయం తర్వాత సమంత అక్కడ కూడా స్టార్ హీరోయిన్ అవ్వడం ఖాయం అని తమిళ సినీ వర్గాల వారు అంటున్నారు.