నాకెవరు పోటి కాదు .నేనెవరికి పోటి కాదు అని స్పష్టంగా చెప్పేసింది సమంత.మీరూ ఇప్పుడు వస్తున్న హీరోయిన్స్ లో ఎవరినైనా పోటిగా భావిస్తారా అనే అడిగేసరికి … ఇలా ఫైర్ అయిపోయింది.” ఈ రంగానికి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు.అలా వస్తున్న వారందరూ నాకు పోటీ అంటే ఎలా? ఇక్కడ ఎవరికి ఎవరూ పోటీ కాదు.బాగా చేస్తే సక్సెస్ అందుకుంటారు.
లేకపోతే లేదు.ఇదే విషయం హీరోలకు ఎందుకు వర్తించదో నాకు అర్థం కాదు.ఇలాంటి వార్తల కారణంగానే హీరోయిన్ల మధ్య దూరం పెరుగుతుందేమో కానీ, సినిమాల వలన కాదు.”
మరి మీరు ఇష్టపడే హీరోయిన్ ఎవరు అని అడగ్గానే … ” ఇంకెవరు? అనుష్కనే! తను ప్రతి సినిమాకీ చాలా కష్టపడుతుంది.క్యారెక్టర్ల పరంగా తను చేసిన, చేస్తున్న ప్రయోగాలు మిగతా వారు చేయడం కష్టం! సినిమాకి అవసరం అనుకుంటే బరువు పెరుగుతుంది.అనవసరం అను కుంటే అదే స్థాయిలో తగ్గుతుంది.
వినడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ, దీని వెనుక తన కృషి ఎంతో ఉంటుంది.దగ్గర్నించి చూసిన వారికే ఇది బాగా అర్థమవుతుంది.తన తరువాత అమీజాక్సన్ అంటే చాలా ఇష్టం.” అంటూ జవాబిచ్చింది ఈ ముద్దుగుమ్మ
.