చిరు సినిమా చేసిన సల్లూ భాయ్‌!

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌, కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ త్వరలో ‘భజరంగీ భాయిజాన్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు.తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడం జరిగింది.

 Salman Khan’s Bajrangi Bhaijaan Connection With Chiru Movie-TeluguStop.com

ఆ ట్రైలర్‌ చూస్తుంటే ఈ సినిమా 80లలో చిరంజీవి నటించిన ‘పసివాడి ప్రాణం’ సినిమాను స్పూర్తిగా తీసుకుని తెరకెక్కించినట్లుగా కనిపిస్తోంది.ఆ సినిమాలో బాలుడి ప్రాణం కోసం చిరంజీవి రౌడీలతో పోరాడితో, ఈ సినిమాలో మాత్రం పాప కోసం సల్లూ భాయ్‌ రౌడీ మూఠాల ఆటకట్టిస్తాడని అనిపిస్తోంది.

బాలీవుడ్‌లో సౌత్‌ సినిమాలు కొత్తేం కాదు.గతంలో పలు సినిమాలను రీమేక్‌ మరియు ప్రీమేక్‌ చేశారు.

అలాగే కొన్నింటి నుండి స్పూర్తి పొంది సినిమాలు చేశారు.ఇప్పుడు ‘భజరంగీ భాయిజాన్‌’ కూడా ఒప్పుకోని కాపీ సినిమా అని కొందరు అంటున్నారు.

ఇప్పటికే పలు సౌత్‌ సినిమాలు చేసి సూపర్‌ డూపర్‌ హిట్‌లను అందుకున్న సల్మాన్‌ ఖాన్‌ ఈ సినిమాతో కూడా భారీ విజయాన్ని అందుకోవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.ఈ సినిమా కూడా సక్సెస్‌ అయితే సల్మాన్‌ ఖాన్‌ మరెన్ని తెలుగు సినిమాలను బాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్తాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube