అఖిల్‌ టీజర్‌.. సల్మాన్‌ ఖాన్‌

అక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌ మొదటి చిత్రం ‘అఖిల్‌’ సినిమా టీజర్‌ను నేడు నాగార్జున పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.ఈ టీజర్‌ను బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ చేతుల మీదుగా విడుదల చేయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

 Salman Khan To Launch Teaser Of Akhil Movie-TeluguStop.com

సల్మాన్‌ ఖాన్‌తో నాగార్జునకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.ఆ కారణం చేతే ‘అఖిల్‌’ టీజర్‌ను సల్లూ భాయ్‌ రిలీజ్‌ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

చాలా రోజులుగా అఖిల్‌ మూవీ కోసం ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు.వినాయక్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో నితిన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

గతంలో ఏ హీరోకు కూడా దక్కని భారీ ఎంట్రీ అఖిల్‌కు ‘అఖిల్‌’ సినిమా ద్వారా దక్కనుంది.ఇప్పటికే ఈ సినిమా అన్ని ఏరియాల్లో కూడా భారీ మొత్తానికి అమ్ముడు పోయింది.

నేడు టీజర్‌ విడుదల కానున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగే ఛాన్స్‌ ఉందని అంటున్నారు.ఇక ఈ సినిమా ఆడియోను వచ్చే నెలలో విడుదల చేసి, దసరా కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube