పెళ్ళి వద్దు కాని పిల్లలు కావాలంట హీరోకి

సల్మాన్ ఖాన్ వయసు సరిగ్గా 50 సంవత్సరాలు.దేశంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే ట్యాగ్ ని గత రెండు దశాబ్దాలుగా మోస్తున్నాడు.

 Salman Wants To Have Kids Without Marriage-TeluguStop.com

ఏ షో కి వెళ్ళినా, ఏ ఫంక్షన్ కి వెళ్ళినా, సల్మాన్ ని అందరు అడిగే ప్రశ్న .పెళ్ళి ఎప్పుడు ? సంగీత బిజ్లాని, పాకిస్తాన్ నటి సోమి ఆలీ, ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్ … ఇంతమందితో ప్రేమాయణం నడిపినా లాభం లేకుండాపోయింది.ఒక్కరు కూడా సల్మాన్ తో పెళ్ళిపీటల దాకా వెళ్ళలేదు.తప్పు సల్మాన్ దేనా లేక తను ప్రేమించిన అమ్మాయిలదా అనేది పక్కన పెడితే, పెళ్ళి అంటే విరక్తి పుట్టేదాకా కమిలిపోయాడు సల్మాన్.

ప్రసుతం రోమానియా నటి లులియా వంటుర్ తో సల్మాన్ డేటింగ్ చేస్తున్నాడు అనే వార్తలు ఉన్నా, దాన్ని సల్మాన్ ఇంకా ధృవికరించలేదు.

మరి అయిదు పదుల వయసు దాటిన సల్మాన్ పెళ్ళెప్పుడు చేసుకుంటాడు … ఇదే విషయం ఇటివలే ఒక పాపులర్ షో లో సల్మాన్ ని అడిగారు.

దానికి సల్మాన్ స్పందిస్తూ ” ఇక నేను పెళ్ళి చేసుకునేది అనుమానమే.నాకు తెలిసి నాది పెళ్ళి చేసుకునే వయసు కాదు, ఆ వయసు నేను దాటేసాను.

పెళ్ళి చేసుకోకున్నా పిల్లల్ని కనాలని ఉంది.ఇద్దరు ముగ్గురు పిల్లలు కావాలి.

పెళ్లి కాకుండా పిల్లలు అంటే కష్టమే కాని మానేజ్ చేసేస్తా ” అంటూ ఎవరు ఊహించని జవాబు చెప్పాడు ఈ కండల వీరుడు.

పెళ్ళి కాకుండా పిల్లల్ని కన్నా, సల్మాన్ ని అడిగేవారు ఎవరు ఉండరేమో కాని, సల్మాన్ కోసం పిల్లల్ని కనే అమ్మాయి ఎవరు ? అంత ధైర్యం ఎవరికుందో !

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube