బాలివుడ్ వర్గాల సమాచారం ప్రకారం మన మహేష్ బాబు హీరోయిన్ కృతి సనన్ దశ తిరిగినట్లే.టిక్కుం టిక్కుం అంటూ అట్టట్టా నెట్టుకొస్తున్న ఈ సుందరి కెరీర్ కొంత పుంతలు తొక్కబోతోందా? ఇంతకీ ఈ హీరోయిన్ ఏం చేసింది? అగ్రహీరోని బుట్టలో పడేసింది.
బాడిగార్డ్ సినిమాని హిందిలో సల్మాన్ ఖాన్ రిమేక్ చేసిన సంగతి తెలిసిందే.కరీనాకపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా భారి విజయాన్ని సొంతం చేసుకుంది.ఇప్పుడు ఆ చిత్రానికి సిక్వెల్ తీయాలనే అలోచనలో ఉన్నాడంట సల్మాన్ భాయ్.అందులో హీరోయిన్ గా కృతి అయితే బాగుంటుంది అని తన సన్నిహితులతో అన్నాడంట.
ఇంతకీ సల్మాన్ మనసు సడెన్ గా కృతి వైపు ఎందుకు వెళ్ళింది అనేగా మీ డౌటు …
సడెన్ గా ఏమి వెళ్లలేదు.డిసెంబరులో దిల్వాలే ప్రమోషన్స్ కోసం సల్మాన్ షో బిగ్ బాస్ లోకి వెళ్ళింది కృతి.
అప్పుడు కృతి నడక,హావభావాలు, అందం … అన్ని సల్మాన్ కి పిచ్చ పిచ్చగా నచ్చేసాయంట.అందుకోసమే కృతికి ఒక అవకాశం ఇచ్చెద్దామని సల్మాన్ ఫిక్స్ అయిపోయాడంట.
తన అందచందాలతో ఆ రకంగా సల్మాన్ ని బుట్టలో వేసుకుంది ఈ 25 ఏళ్ళ భామ.అసలే సినిమాలు లేక అల్లాడిపోతున్న కృతికి ఈ వార్త నిజమైతే బంపర్ లాటరీ తగిలినట్టే.