జాతీయ ఉత్సవంలా ములాయం పుట్టినరోజు వేడుక

రేపు అంటే 22వ తేదీన ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి , సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ పుట్టిన రోజు.అయితే ఏమిటి? ఇందులో విశేషం ఏముంది? అని ప్రశ్నిస్తాం.ఆయన పుట్టినరోజు వేడుక మామూలుగా జరిగితే చెప్పుకోవలసిన పని లేదు.ఇది జాతీయ స్తాయిలో జరగబోతున్న భారీ ఉత్సవం.ములాయం 76వ పుట్టిన రోజును చాలా భారీగా నిర్వహిస్తున్నారు.ములాయం సొంత ఊరు సైఫై లోని కీడా మైదానంలో వేడుకలు జరుగుతాయి.

 Saifai Gets Ready For Mulayam Singh’s Birthday-TeluguStop.com

ఆస్కార్ అవార్డు విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సంగీత విభావరి నిర్వహిస్తారు.విశేషం ఏమిటంటే రెహ్మాన్ సంగీత కచేరి పర్యావరణం మీద ప్రజలకు అవగాహన కలిగించే విధంగా ఉంటుంది.

రాజకీయ నాయకులతో సహా అన్ని రంగాల నుంచి 50,000 మంది ప్రముఖులు హాజరవుతున్నారు.వీరిలో వ్యాపార దిగ్గజాలు, పారిశ్రామికవేత్తలు, సినిమా తారలు మొదలైనవారు ఉన్నారు.10 దేశాల నుంచి రాయబారులు కూడా వస్తున్నారట.సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, అమితాబ్ బచ్చన్, ఆయన భార్య ,ఎంపీ అయిన జయా బచ్చన్ హాజరవుతున్నారు.

అనిల్ అంబానీ వస్తున్నారు.లాలూ ప్రసాద్ యాదవ్ , శరద్ యాదవ్, మాజీ ప్రధాని దేవె గౌడ రాబోతున్నారు.

ప్రభుత్వ అతిథి గృహాలు, హోటళ్ళు ఎన్ని ఉన్నాయో అన్నీ బుక్ చేసిపారేశారు .పుట్టిన రోజును ఇంత భారీగా చేయడానికి కారణం ఏమిటి?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube