హీరోయిన్ లు చాలా మంది తమకు నచ్చిన విధంగా రకరకాల టాటూ లు ఒంటి మీద వేయించుకుంటారు .హీరోయిన్ లకు అవి ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెడతాయి.
బాలీవుడ్ లో ఈ టాటూ కల్చర్ చాలా కామన్ కాని తెలుగులో నటించే హీరోయిన్ లు ఇవి వేయించుకోవడం అరుదు.కాని టాలీవుడ్ లో కొంతమంది హీరోయిన్ లు కూడా ఈ టాటూ కల్చర్ కి అలవాటు పడ్డారు .త్రిష,తాప్సి,హరిప్రియ,శ్రుతి లాంటి వాళ్ళు టాటూ లు వేయించుకున్నారు.శృతి, హరి ప్రియ లాంటి వాళ్ళు చేతుల మీదనో లేక భుజాల మీదనో వేయించుకున్నారు తాప్సి అయితే తన హిప్ కు క్రింద భాగంలో పచ్చబొట్టు వేయించుకుంది.
అందరి టాటూ లలో కెల్లా బాగా ఫేమస్ అయ్యింది చెన్నై నల్లపిల్ల త్రిష టాటూనే.అందరిలా చేతుల మీదనో,కాళ్ళ మీదనో కాకుండా ఎక్కడ వేయిస్తే సరియైన గుర్తింపు వస్తుందో సరిగ్గా అక్కడ వేయించుకుంది.
త్రిష తన ఎదభాగంలో ఎడమవైపు సీతాకోకచిలుక టాటూను వేయించుకుంది.అంతేకాకుండా ఆ టాటూ అందరికీ కనిపించే విధంగా లోనేక్ బట్టలు వేసుకుని క్లివేజ్ షో చేసేది త్రిష.
ఇప్పుడు సరిగ్గా త్రిష విధానాన్ని హీరోయిన్ రోజా ఫాలో అవుతుంది.త్రిష వేయించుకున్న సేమ్ ప్లేస్ లోనే రోజా కూడా ఒక టాటూ వేయించుకుంది ఈ వెటరన్ హీరోయిన్.
కుర్ర హీరోయిన్ లు అంటే జనాలను ఆకర్షించటానికి వారి హాట్ స్పాట్ ల దగ్గర టాటూ లు వేయించుకుంటారు.మరి దాదాపు అంతా ఫేడ్ అవుట్ అయ్యి చివరకు బుల్లితెర మీద యాంకరింగ్ లు చేస్తున్న రోజాకు ఎందుకు ఈ బుద్ది పుట్టిందా అని అందరూ అనుకుంటున్నారు.
ఈమధ్యనే ఒక ఆడియో ఫంక్షన్ కు హాజరు అయిన రోజా చున్ని కొంచెం అదుపు తప్పటంతో ఫోటో గ్రాఫర్ లు ఈ టాటూ ను క్లిక్ మనిపించారు.