రిమేక్ సినిమా అంటే తీసిన కథనే మళ్ళీ తియడం అని మనకు తెలిసిందే.ఇతర భాషలో హిట్ అయిన చిత్రాల్ని, సెట్ అయితే పూర్తిగా కాపి చేయడం, లేదంటే ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా చిన్నచిన్న మార్పులు చేయడం మనకు తెలుసు.
ఒక్కోసారి ఒరిజినల్ సినిమాలో వాడిన నేపథ్య సంగీతాన్ని, పాటల్ని కూడా వాడేస్తుంటారు (తెలుగు ప్రేమమ్).ఇప్పటివరకు రిమేక్ సినిమాలు అంటే మనకు తెలిసిన విషయాలు ఇవి.కాని ఇప్పుడు తమిళ సినిమా కత్తిని రిమేక్ చేసిన ఖైదీనం 150 యూనిట్ మరో విచిత్రమైన పని చేసింది.
ఈ ఫోటోలు చూస్తే మీకు ఏం అర్థం అవుతోంది? అర్థం అయితే ఫర్వాలేదు కాని, అర్థం కాకపోతే ఏం చేసారో చెప్తున్నాం చూడండి.ఖైదీనం 150 చిత్రంలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించలేదు .కత్తి కోసం తీసిన సీన్ ని ఇక్కడ అతికించేసారు.కాకపోతే, డిఐ వర్క్ లో కలరింగ్ మార్చేసారు అంతే.