కేసిఆర్ పై ప్రయోగానికి కేటిఆర్ సాయం-RGV To Take Help From KTR On KCR Biopic 3 months

KCR Biopic Birthday Ktr RCK Rgv RGV To Take Help From KTR On Photo,Image,Pics-

గత రెండు రోజుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై రెండు సినిమాల ప్రకటన జరిగింది. ఒకటి మధుర శ్రీధర్ దర్శకత్వంలో రాజ్ కందుకూరి నిర్మించేది, మరొకటి ఏకంగా రామ్ గోపాల్ తెరకెక్కించేది. ఇందులో మధుర శ్రీధర్ సినిమా వచ్చే ఏడాది మొదలయ్యి 2018లో కేసిఆర్ పుట్టినరోజు కానుకగా ఫిబ్రవరి 17వ తేదిన విడుదల చేస్తారట.

ఇటువైపు రామ్ గోపాల్ వర్మ అంత వివరంగా ఏం ప్రకటించకపోయినా, తన సినిమా పేరు KCR కి రివర్స్ గా RCK అని ఉంటుందని చెప్పారు. ప్రకటన అయితే జరిగింది కాని, ఇదేదో కామెడిగా అంటున్నారో, లేక నిజంగానే సినిమా మొదలుపెడతారో, మొదలుపెట్టినా, మధ్యలోనే ఆపేస్తారో ఎవరికి తెలీదు.

మరోవైపు రామ్ గోపాల్ వర్మ మరో బాంబ్ పేల్చారు. కేసిఆర్ పై తీయబోయే సినిమా కోసం పెద్దగా రీసెర్చ్ చేయనున్నాడట ఆర్జీవి. అది కూడా కేసిఆర్ కుమారుడు కేటిఆర్ ని సంప్రదించి, కేసిఆర్ జీవితం గురించి మరింత బాగా చర్చించి సినిమా మొదలుపెడతారట. వర్మ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో కనిపెట్టడం కష్టం కాబట్టి, ఈ సినిమా గురించి మొదలయ్యేంతవరకు పెద్దగా ఆలోచించకపోతేనే మంచిది.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. ఇక ఆ హీరోయిన్ కి ఫ్లాప్ అనేదే రాదా ?

About This Post..కేసిఆర్ పై ప్రయోగానికి కేటిఆర్ సాయం

This Post provides detail information about కేసిఆర్ పై ప్రయోగానికి కేటిఆర్ సాయం was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

RGV to take help from KTR on KCR Biopic, RGV,KCR Biopic, KTR, February 2018, KCR Birthday, RCK

Tagged with:RGV to take help from KTR on KCR Biopic, RGV,KCR Biopic, KTR, February 2018, KCR Birthday, RCKFebruary 2018,KCR Biopic,KCR Birthday,ktr,RCK,rgv,RGV to take help from KTR on KCR Biopic,,