‘శ్రీమంతుడు’పై షాకింగ్‌ కామెంట్స్‌

టాలీవుడ్‌ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘శ్రీమంతుడు’.సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ఫ్యాన్స్‌ ఈ సినిమా 100 కోట్లు వసూళ్లు చేయడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 Rgv Sensational Tweet On Srimanthudu-TeluguStop.com

కొన్ని ఏరియాల్లో ‘బాహుబలి’ కలెక్షన్స్‌ను సైతం ఈ సినిమా సాధిస్తుందనే నమ్మకంతో వారున్నారు.ప్రస్తుతం ‘శ్రీమంతుడు’కు ఉన్న క్రేజ్‌ చూస్తుంటే నిజంగానే అలా జరుగుతుందేమో అనిపిస్తుంది.

అయితే ఈ క్రమంలో వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ‘శ్రీమంతుడు’పై షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు.

ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద ట్వీట్‌ చేసే వర్మ తాజాగా ట్విట్టర్‌లో.

తాను ‘శ్రీమంతుడు’ నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్‌తో మాట్లాడాను అని, ఆయన మాటలను బట్టి చూస్తుంటే ‘శ్రీమంతుడు’ విడుదల అయిన తర్వాత ‘బాహుబలి’ కలెక్షన్స్‌ మళ్లీ పెరిగే అవకాశాలున్నాయి అంటూ ఆశ్చర్యకర ట్వీట్‌ చేశాడు.వర్మ చేసిన ఈ ట్వీట్‌కు మహేష్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

ఏ అంశాలను బేరీజు వేసుకుని వర్మ ఇలాంటి ట్వీట్‌ చేశాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వర్మ పిచ్చి కూతలు పట్టించుకుని ‘శ్రీమంతుడు’ సినిమా గురించి అభిమానులు భయపడరు అంటూ ఫ్యాన్స్‌ అంటున్నారు.

ఈనెల 7న శ్రీమంతుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్న విషయం తెల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube