150వ సినిమాపై వర్మ స్పందన??

తనకు చెందిన, చెందని విషయాల గురించి ఎప్పటికప్పుడు ట్విట్టర్‌లో స్పందిస్తూ, ఎప్పుడూ వివాదాస్పదం అయ్యే రామ్‌ గోపాల్‌ వర్మ చిరంజీవి 150వ సినిమా గురించి లెక్కలేనన్ని సార్లు ట్వీట్స్‌ చేశాడు.ముఖ్యంగా ‘టెంపర్‌’ సినిమా విడుదల తర్వాత రామ్‌గోపాల్‌ వర్మ చేసిన ట్విట్‌ అందరి దృష్టిని ఆకర్షించింది.

 Rgv Reaction On Chiru Film 150th Movie..?-TeluguStop.com

‘టెంపర్‌’ సినిమాతో దర్శకుడు పూరి జగన్నాధ్‌ తన ప్రతిభను మొత్తం చూపాడని, చిరు తన 150వ సినిమాకు మారు మాట్లాడకుండా పూరి జగన్నాధ్‌తో చేయడం బెస్ట్‌ అంటూ ట్వీట్‌ చేయడం జరిగింది.అయితే అప్పుడు చిరు తన 150వ సినిమాను పూరితో చేస్తాడా అనే అనుమానాలు వ్యక్తం చేశారు.

రామ్‌గోపాల్‌ వర్మ ట్వీట్‌ను చిరు ఫాలో అయ్యాడో ఏమో కాని తాజాగా 150వ సినిమాకు పూరి దర్శకుడిగా ఫిక్స్‌ అయ్యాడు.తాజాగా రామ్‌ చరణ్‌ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు.

పూరి దర్శకత్వంలో చరణ్‌ నిర్మాణంలో చిరు 150వ సినిమా ఆగస్టు 22న ప్రారంభం కాబోతుంది.చిరు 150వ సినిమా ప్రకటన నేపథ్యంలో రామ్‌ గోపాల్‌ వర్మ ఎలా స్పందిస్తాడో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

చిరు తన సలహా పాటించినందుకు వర్మ ఎలా రియాక్ట్‌ అవుతాడో చూడాలని ఉందని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.ప్రస్తుతం వరుస సినిమాలతో వర్మ బిజీగా ఉండటం వల్ల సోషల్‌ మీడియాకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube