తానేం చేసిన పబ్లిసిటీ కోసమే అనే రామ్‌గోపాల్ వర్మ నిన్న లోఫర్ ఆడియో వేడుకలో పాల్గొన్నాడు.అక్కడ వరుణ్‌తేజ్‌ను చూసి ముచ్చట పడ్డాడేమో ఈరోజు ట్విట్టర్లో వరుణ్‌ను ఆకాశానికెత్తేస్తున్నాడు.
అయితే ఓరోజు పొగుడుతాడు, మరో రోజు తిడుతాడనే విషయం అందరికీ తెలిసిందే.ఈ లిస్టులో చాలా మంది ఉన్నారు.
ఇప్పుడు రీసెంట్గా వరుణ్‌తేజ్ ఈ లిస్టులో చేరాడు.లోఫర్లో వరుణ్ నటనకు వర్మ ముగ్ధుడయ్యాడట.
వరుణ్ తేజ్ చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే బ్యాచ్ కాదు.చెట్టుకు గౌరవం తెస్తాడు కానీ చెట్టు కొమ్మలాగా బతకాలనుకోడు.
స్టార్ పవర్ కోసం మెగాస్టార్, పవర్స్టార్లపై ఆధారపడడు.మెగా ట్రీ పై ఆధారపడడు తనకంటూ ఓ సోలార్ బ్యాటరీ పవర్ ఉంది అని మెచ్చుకున్నాడు.
ఇంత వరకు బాగానే ఉంది.వర్మ మెచ్చుకుంటూ మెచ్చుకున్నాడు కానీ చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే బ్యాచ్ కాదు అని విమర్శించడం వెనుక ఏ హీరోలను తిట్టాడో తెలియడం లేదు.
మిగతా హీరోలను వర్మ టార్గెట్ చేశాడా? లేక మెగా హీరోలనే టార్గెట్ చేశాడా అని కచ్చితంగా తెలియడం లేదు.మరి ఈ విషయం వర్మకే తెలియాలి.