పవన్ వేసుకునే చెప్పు అంత లేదు నీ బ్రతుకు, మొరిగే కుక్క

పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది.రెగ్యులర్ మాస్ సినిమా కావడంతో విమర్శకులు సినిమాకి నెగెటివ్ మార్కులే వేస్తున్నారు.

 Rgv Is Not Equal To Pawan Kayan’s Foot Wear – Bandla-TeluguStop.com

ఇక రామ్ గోపాల్ వర్మకి ఇలాంటి అవకాశమే కదా కావాల్సింది.దాంతో మళ్ళీ పవన్ కళ్యాణ్ మీద ఏటాక్ చేయడం మొదలుపెట్టారు .అసలు ఆయనకే తప్ప, ఎవరికి అర్థం కాని ట్వీట్స్ తో మళ్ళీ పవర్ స్టార్ మీద, కాటమరాయుడు మీద దాడి చేసారు.

జెమ్స్ కామరూన్, క్రిస్టోఫర్ నోలాన్, స్టీవెన్ స్పిల్ బర్గ్ లాంటి హాలివుడ్ దిగ్గజ దర్శకులు కూడా కాటమరాయుడు చూడాలనుకుంటున్నారని, హాలివుడ్ నిర్మాణ సంస్థలు డిస్నీ, ఫాక్స్ కూడా పవన్ ని తమ సంస్థలో నటింపజేయాలనుకుంటున్నాయని మొదట సైటర్లు వేసిన ఆర్జీవి, ఆ తరువాత పంపిణిదారులకి నష్టాలు వస్తున్న పట్టించుకోని పవన్ తన కూతూళ్ళ పుట్టినరోజు సంబరాలు చేసుకోవడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ట్విట్టర్ లో వర్మ ఎటాక్ మీద కౌంటర్ ఎటాక్ వేసేందుకు పవన్ కళ్యాణ్ పరమభక్తుడు బండ్ల గణేష్ రంగంలోకి దిగాల్సివచ్చింది.“రాము .నీ నాలుక కంట్రోల్ లో పెట్టుకో, నువ్వు పవన్ కళ్యాణ్ వేసుకోని చెప్పుకి కూడా సమానం కావు, వీధిలో మొరికే కుక్క లాంటోడివి, నిన్ను ఇండియన్ అని పిలవాలంటే కూడా సిగ్గుగా ఉంది.ఎక్సపైరి డేట్ అయిపోయిన టాబ్లేట్ లాంటోడివి, మా జోలికొస్తే ఊరుకోం.

నువ్వు దేశానికి తీసుకొచ్చిన నష్టాలతో పోలిస్తే, ఈ నష్టాలు ఓ లెక్క కూడా కాదు, నువ్వో తీవ్రవాదివి, నిన్ను మెంటల్ హాస్పిటల్ లో వేయాలి” అంటూ బండ్ల గణేష్ రెచ్చిపోయారు.

ఇక బండ్లకి సపోర్ట్ గా, కాటమరాయుడులో ఓ ముఖ్య పాత్ర పోషించిన హీరో శివబాలాజి కూడా రామ్ గోపాల్ వర్మ మీద మాటలదాడికి దిగారు.

వీరిద్దరు ఎంత మొత్తుకుంటున్నా, అవేమి పట్టించుకోకుండా, తన విమర్శలు తాను పోస్ట్ చేసుకుంటూపోయారు వర్మ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube