'స్వచ్ఛ మూసీ' చేయగలరా?

రాంగోపాలవర్మ కేవలం సినిమా దర్శకుడు మాత్రమే కాదు.వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వ్యక్తి.

 Rgv Challenges Kcr On Swachch Musi River-TeluguStop.com

వివాదాలను కొని తెచ్చుకునే వ్యక్తి.భక్తి నుంచి రక్తి వరకు, రాజకీయాల నుంచి రాసలీలల వరకు ఏం అంశాన్నీ వదలిపెట్టడు.

నెలలో ఎక్కువ రోజులు ఏదో ఒక సబ్జెక్టుపై ట్విట్టర్లో కామెంట్లు చేస్తూనే ఉంటాడు.ఆయనకు సామాన్యులైనా, సీఎంలైనా ఒక్కటే.తాజాగా రాంగో తెలంగాణ ముఖ్యమంత్రికి ఛాలెంజ్‌ విసిరారు.‘మూసీ నదిని స్వచ్ఛ మూసీ చేయగలరా?’ అని సవాలు చేశారు.కేసీఆర్‌ కనుక మూసీని స్వచ్ఛ మూసీ చేస్తే ఆయనలో దేవతలంతా కొలువై ఉన్నారని నేను అంగీకరిస్తా అని రాంగో ట్వీట్‌ చేశారు.అంటే మూసీని పరిశుభ్రం చేయలేరని ఆయన అభిప్రాయం.

ఇది వాస్తవం కూడా.మూసీని బాగు చేయడం ఎవ్వరివల్లా కాదు.

నిజానికి మొన్నీమధ్య మూడు రోజులు నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్‌, స్వచ్ఛ తెలంగాణ వల్ల నగరం అద్దంలా మారుతుందని అనుకోవడం పొరపాటు.ఈ కార్యక్రమం ముగిసిపోగానే నగరంలో ఎక్కడి చెత్త అక్కడే ఉంది.

చాలా ప్రాంతాల్లో కుప్పలుగా పేర్కొన్న చెత్త దుర్వాసన వెదజల్లుతోంది.నాయకులంతా ఫొటోల కోసం తట్టలు మోస్తారు, చెత్త ఊడుస్తారుగాని నిజంగా పనిచేస్తారా? ఫొటోలు తీసుకోగానే అన్నీ అక్కడ పడేసి వెళ్లిపోతారు.మోదీ స్వచ్ఛ భారత్‌ ఫార్సును ఢిల్లీలో చూశాం కదా.ప్రత్యేకంగా చెత్త పోయించి ఫొటోల కోసం కార్యక్రమం నిర్వహించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube