కోదండ‌రాం కొత్త పార్టీలోకి ఆ ఇద్ద‌రు జంప్‌..!

తెలంగాణ‌లో కొత్త‌రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల‌పై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.టీజేఎసీ ఛైర్మ‌న్ కోదండ‌రామ్ సార‌థ్యంలో కొత్త‌పార్టీ ఏర్పాట‌వుతుందంటూ కొద్ది రోజులుగా జ‌రుగుతున్న స‌న్నాహాలు ఊపందుకున్నాయి.

 Revanth Reddy Joins Kodandaram New Party..?-TeluguStop.com

కోదండ‌రాం రెడ్డి అలియాస్ కోదండ‌రాం టార్గెట్‌గా కొద్ది రోజులుగా తెలంగాణలో అధికార టీఆర్ఎస్ మాట‌ల దాడులు ఊపందుకున్నాయి.కోదండ‌రాం తెలంగాణ అంత‌టా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తూ … రాష్ట్రంలో ప‌ర్య‌టించ‌టాన్ని గులాబీ నేత‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

ప్ర‌భుత్వ ప‌నితీరుపై ఆయ‌న ప్ర‌శ్నించ‌టాన్ని భ‌రించ‌లేక‌పోతున్నారు.

ప్ర‌త్యేక రాష్ట్రంలో తొలి సీఎంగా రికార్డుల‌కు ఎక్కిన కేసీఆర్ మ‌రో రెండు ద‌శాబ్దాల పాటు అక్క‌డ టీఆర్ఎస్‌ను అధికారంలో ఉంచేందుకు ధీర్ఘ‌కాలిక ప్ర‌ణాళిక‌ల‌తో దూసుకుపోతున్నారు.

ఈ క్ర‌మంలోనే కేసీఆర్ అక్క‌డ వ్యూహాత్మ‌కంగా ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను నిర్వీర్యం చేస్తున్నారు.విప‌క్షాల‌కు ఛాన్స్ ఇవ్వ‌కుండా దూసుకెళుతోన్న కేసీఆర్‌కు కోదండ‌రాం విమ‌ర్శ‌లు కంట్లో న‌లుసులా మారాయి.

ఈ క్ర‌మంలోనే ఎంపీలు క‌విత‌, బాల్క సుమ‌న్ వంటి వారు కోదండ‌రాంను టార్గెట్‌గా చేసుకుని ప‌దే ప‌దే విమ‌ర్శ‌లు చేస్తున్నారు.మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్‌యాద‌వ్ మ‌రో అడుగు ముందుకేసి తెలంగాణ ద్రోహుల‌తో కొదండ‌రామ్ జ‌ట్టుక‌ట్టాడంటూ ఘాటుగా స్పందించాడు.

ఈనేప‌థ్యంలోనే ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్యూలో కొదండ‌రామ్ అన్న కొత్త రాజ‌కీయ‌పార్టీ మాట చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

తెలంగాణ‌లో ఆప్ త‌ర‌హాలో ఓ ప్రాంతీయ పార్టీ రావాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

కోదండ‌రాం కొత్త పార్టీ పెడ‌తార‌ని…ఆ పార్టీలో టీడీపీలో ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న రేవంత్‌రెడ్డి, నాగం జ‌నార్ద‌న‌రెడ్డి ఖ‌చ్చితంగా జాయిన్ అవుతార‌ని.కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రి కోమ‌టిరెడ్డి లాంటి వాళ్లు కూడా కోదండ‌రాంతో జ‌ట్టు క‌డ‌తార‌న్న చ‌ర్చ‌లు టీ పాలిటిక్స్‌లో వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube