మళ్ళీ ఒక్కటవుతున్న మాజీ ప్రియులు?

ఎవరో అన్నట్టు .సినిమావాళ్ళకి ఎవరు శాశ్వత మిత్రులు కాదు, ఎవరు శాశ్వత శతృవులు కాదు.

 Reunion Of Salman And Katrina?-TeluguStop.com

ఓ క్షణంలో ఎవరి మనసైనా మారొచ్చు .నిన్న ఛీ కొట్టినవారు ఈరోజు ముద్దు చేయొచ్చు … ప్రస్తుతం ఇలాంటిదే ఏదో జరుగుతోంది బాలివుడ్ మాజీ ప్రియులు సల్మాన్ ఖాన్, కత్రీనా కైఫ్ ల మధ్య.ఒకప్పుడు పీకల్లోతు ప్రేమలో మునిగి, ఏవో కారణాల వల్ల ఇద్దరు విడిపోయారు.

ఆ తరువాత కత్రీనా రణబీర్ కపూర్ ని డేట్ చేస్తే, సల్మాన్ మాత్రం ఒంటరిగానే మిగిలిపోయాడు.

సల్మాన్ కి ఒక విదేశీ గర్ల్ ఫ్రెండ్ ఉందని కథనాలు వచ్చినా, అందులో నిజమెంతో తెలియదు.ఇప్పుడు కత్రీనా రణబీర్ విడిపోయారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఇన్నీ సంవత్సరాలు ఎడమొహం పెడమొహంగా ఉన్న సల్మాన్ కత్రీనా ఈమధ్య తెగ కలుసుకుంటున్నారు.దీంతో రణబీర్ – కత్రీనా బ్రేకప్ వార్తలకు మరింత బలం చేకూరింది.

కత్రీనా కొత్త సినిమా ఫితూర్ ని సల్మాన్ ప్రమోట్ చేస్తున్నాడు.ఇటివలే ఒక హింది ప్రోగ్రామ్ కీ కత్రీనాతోపాటు వచ్చి తాను యూనిట్ మెంబర్ కాకపోయినా మాజి ప్రేయసి కోసం సినిమాని ప్రమోట్ చేస్తాడు.

ఇదంతా చూసి, రణబీర్ – కత్రీనా నిజంగానే విడిపోయారని, రణబీర్ ని వదిలేసాక సల్మాన్ కత్రీనాల మధ్య మళ్ళీ స్నేహం కుదిరిందని, మాజీ ప్రియులు మళ్ళీ ఒక్కటవ్వొచ్చని బాలివుడ్ జనాలు గుసగుసలు పెట్టుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube