మొబైల్ నీటిలో పడితే ఆ తర్వాత తీసుకోవాల్సిన 7 జాగ్రత్తలు

వేలకు వేలు పెట్టి స్మార్ట్ ఫోన్లు కొంటున్నాం.ఒక్క తప్పు చేస్తే, ఒక్క సెకను అజాగ్రత్తగా ఉంటే మన అత్యవసర వస్తువు స్మార్ట్ ఫోన్ ని నీటిలో పోసిన వాళ్ళమవుతాం.

 Remedy Steps To Taken If Your Mobile Falls Into Water-TeluguStop.com

ఫోన్ నేల మీద బలంగా పడినా, ఏదో మూల ఆశ ఉంటుంది, ఆ ఫోన్ బతికే ఉంటుందేమో అని, చాలాసార్లు ఫోన్ కి ఏమి జరగదు కూడా.కాని నీటిలో పడితేనే పెద్ద ప్రమాదం.

నేల మీద పడితే పెద్దగా నష్టం వాటిల్లకుండా గొరిల్లా గ్లాసులు, మెటల్ డిజైన్లు ఇస్తున్నారు కాని నీటి నుంచి కాపాడటం కష్టమే కదా.ఎందుకంటే మొబైల్ ఒక ఎలక్ట్రానిక్ పరికరం

ఫోన్ నీటిలో పడితే, చాలామంది చేసే పొరపాటు అది పనిచేస్తుందో లేదో అప్పటికప్పుడు చెక్ చేయాలనుకోని ఆన్ చేయడం.అది చాలా తప్పు.మరి ఏం చేయాలి?

* ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మొబైల్ బయటకు తీయండి.ఒక వేళ మొబైల్ అప్పటికి ఆన్ లో ఉండే వెంటనే ఆఫ్ చేయండి.ఆఫ్ అయిపోయి ఉంటే ఆన్ చేయవద్దు

* మొబైల్ నుంచి సిమ్ కార్డుని, బ్యాటరీని వేరు చేయండి.

ఎంతవరకైతే మొబైల్ని విప్పగలరో అంతవరకూ విడదీయండి.

* ఆఫ్ లో ఉన్న మొబైల్ ని డ్రై చేసేందుకు ప్రయత్నించండి.

టిష్యూ లేదా టవల్ వాడుతూ తడిని తుడిచేయండి.కాసేపు ఎండలో పెట్టండి.

హెయిర్ డ్రయర్ ఉంటే ఫోన్ మొత్తం డ్రై చేయండి.వాక్యూమ్ క్లీనర్ ఉంటే దాన్ని ఉపయోగించండి.

అయితే ప్రెషర్ ని చాలా జాగ్రత్తగా వదలాలి.తడి బయటికి రావాలి కాని ఇంకా లోపలికి వెళ్ళకూడదు

* ఇప్పుడు మొబైల్ని తిరిగి అమర్చండి.

తడి పూర్తిగా ఆరిన తరువాత అమర్చాలి.విషయం గుర్తుపెట్టుకోండి

* వండని బియ్యం తీసుకోని, ఒక ప్లాస్టిక్ కవర్ నిండా నింపి, ఆ కవర్ లో మీ మొబైల్లో 12 గంటల పాటు ఉంచండి.

బియ్యం లోపల ఉన్న తడిని పీల్చుకుంటాయి

* ఆ తరువాత కాసేపు మొబైల్ ఎండలో పెట్టండి.మిగిలిపోయిన తడి కూడా ఆరిపోయే అవకాశం ఉంటుంది

* ఈ పద్ధతులన్నీ పాటించిన తరువాతే mobile ఆన్ చేయండి.

mobile నీటిలో పడిన కాసేపటికే ఎలక్ట్రిక్ సర్క్యూట్లో తీవ్రమైన ఇబ్బందులు తలెత్తక పోయి ఉంటే ఇప్పుడు మీ మొబైల్ ఖచ్చితంగా ఆన్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube