మతిమరపు రాకూడదంటే ఇదిగో ఉపాయం

వయసు పైబడినా కొద్ది మతిమరపు రావడం అనేది చాలా సహజమైన విషయం.ముసలివాళ్లలో ఇది ఇంకా సాధారణమైన విషయం.

 Regular Intake Of Coffee Will Prevent Alzheimer’s And Parkinson’s Di-TeluguStop.com

కాని ఒక చిన్ని అలవాటు వలన ఇటు మతిమరుపుని, ముసలితనంలో వచ్చే పార్కిన్సన్ డిసీజ్ ని కూడా అడ్డుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.ఆ చిన్ని ఉపాయమే కాఫీ.

అవును, కాఫీ అలవాటు వలన మతిమరుపు మరియు చేతులు వణకడం లాంటి సమస్యలని అడ్డుకోవచ్చు అని పరిశోధనలు తేల్చాయి.

పోర్చుగల్ లోని కోయెంబ్రా యూనివర్సిటి పరిశోధకులు కొన్నేళ్లుగా ఓ రీసర్చిలో పాల్గొని, కాఫీ రెగ్యులర్ గా తాగే అలవాటు ఉన్నవారికి ముసలితనంలో పార్కిన్సన్ వ్యాధి, మతిమరుపు వచ్చే అవకాశం ఏకంగా 27% తగ్గుతుందని రిపోర్టులో పేర్కొన్నారు.

కాఫీ లో కేఫైన్, కేఫిక్ ఆసిడ్, పాలిఫెనాల్ లాంటి యాంటి ఇంఫ్లేమెంటరి మరియు యాంటి ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉండటం వలన ఇది మెదడుని, మెదడు యొక్క నరాలని ఎప్పుడు శక్తివంతంగా ఉంచుంతుందని, ఓ మోస్తారుగా, రోజుకి 400 మిలిగ్రాముల కేఫైన్, అంటే 4-5 కప్పుల కాఫీ తాగితే లాభాలే ఉన్నాయని ప్రొఫెసర్ రోడ్రిగో ఏ కున్హ తెలిపారు.

మెదడుని చురుకుగా పనిచేయిస్తుంది కాఫీ.

అందులో ఎలాంటి సందేహం లేదు.అయితే వ్యసనంగా మారకుండా జాగ్రత్తపడి మాడరేట్ ఇంటేక్ తీసుకోగలరేమో ఆలోచించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube