రెజినాలో ఆ యాంగిల్ చూపిస్తున్నారు..!

టాలీవుడ్ లో అటు స్టార్ హీరోయిన్ గా.ఇటు మిడిల్ రేంజ్ హీరోయిన్ గా ఎటు కాకుండా ఉన్న రెజినా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తుంది.

 Regina Tried Different Role In Upcoming Tamil Movie-TeluguStop.com

ముందు తమిళంలో కెరియర్ స్టార్ట్ చేసి చిన్నగా తెలుగులో పాగా వేసేందుకు వచ్చిన ఈ చిన్నది కుర్ర హీరోలతో నటిస్తూ ఒక హిట్టు రెండు ఫ్లాపులతో కెరీర్ కొనసాగిస్తుంది.అయితే తనలోని హాట్ యాంగిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్న దర్శక నిర్మాతలకు గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చిన రెజినా ఇప్పుడు మరో యాంగిల్ కూడా ట్రై చేస్తుంది.

టాప్ హీరోయిన్స్ కూడా హీరోయిన్స్ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారని.తాను కూడా అదే బాటలో వెళ్తుంది రెజినా అందుకే తన అభిమానులకు హర్రర్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమైంది.

కోలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో డెవిల్ రోల్ చేస్తుంది రెజినా.ఈ సినిమాకు మరో ప్రత్యేకత ఏంటంటే మరో దర్శకుడు గౌతం మీనన్ దీన్ని నిర్మిస్తున్నారు.

అంతేకాదు మరో దర్శకుడు ఎస్.జె.సూర్య నటిస్తున్నాడు.

ఇంతమంది దర్శకుల కలయికతో వస్తున్న ఈ సినిమాలో రెజినా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

ఇక తనలోని ఈ కొత్త యాంగిల్ తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే ఆలోచన చేస్తుంది ఈ అమ్మడు.రెజినా ఊహించినట్టుగా ఈ సినిమా ఏమాత్రం ప్రేక్షకులకు చేరువయ్యేలా చేస్తుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube