కేసీఆర్ కాసుకో...సవాల్ విసురుతున్న రెడ్లు

తెలంగాణలో కేసీఆర్ పాలన వచ్చాక.బంగారు తెలంగాణా ఏమో కానీ పాలిటిక్స్ మటకు ఎప్పుడు లేనంతగా రంజుగా ఉన్నాయి.

 Reddy’s Politics In Telangaana-TeluguStop.com

వచ్చే ఎన్నికల్లో కూడా టీఆరెస్ హవానే కొనసాగుతుంది అని తెలిసిన నేపథ్యంలో.ప్రతిపక్షాలు మాటల దాడులు.

చేయడం.కుల రాజకీయాలు చేయడం మరింత పెంచేశాయి.

కేసీఆర్ వీటన్నిటినీ సీరియస్ గా తీసుకోకపోయినా .ఎన్నికల సమయం ముంచుకొస్తుండటంతో వీటిపై ప్రత్యక దృష్టి పెట్టారని తెలుస్తోంది

తెలంగాణ లీడర్లలో బోల్డ్ గా మాట్లాడే నేతల్లో ఒకరు జగ్గారెడ్డి.తాజాగా ఆయన ఇచ్చిన పిలుపు తెలంగాణా రాజకీయాలలో హీట్ పెంచుతోంది.కేసీఆర్ రెడ్లని కావాలనే అనగదొక్కుతున్నారు అని.ఈ సమయంలో రెడ్లు ఏ పార్టీలో ఉన్నాసరే బయటకి రావాలని పిలుపు ఇచ్చారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా రెడ్లంతా ఏకం కావాలని ఆయన అన్నారు.

వివిధ పార్టీల్లోని రెడ్లంతా బయటకు రావాలని.ఏకం అయ్యి కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని జగ్గారెడ్డి పిలుపునిచ్చారు.

తెలంగాణలో రెడ్లను అణగదొక్కేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని తెలిపారు.

జేఏసీ నేత కోదండరాం పై కేసీఆర్ చేసిన విమర్శల పట్ల జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు.

ఉద్యమం సమయంలో కోదండరాం కావాలి.ఇప్పుడు మీకు నచ్చడం లేదు.

అప్పటికి ఇప్పటికి కోదండరాం ఒకేలా ఉన్నారు.కానీ ముఖ్యమంత్రి అవ్వగానే కేసీఆర్ కి అధికార తలకెక్కింది అని జగ్గారెడ్డి విమర్శించారు.

తెలంగాణ రావడంలో జేఏసీ పాత్ర, సకలజనుల సమ్మె పాత్ర కీలకం అని.అలాంటివాళ్ళని పూర్తిగా పక్కనపెట్టారు అని విమర్శించారు.జగ్గారెడ్డి.మరియు రెడ్డి వర్గం నాయకులు అంటున్నారు

రెడ్లని అణిచివేయడానికి కారణం వెనుక అసలు నిజం .రెడ్లు బీసీలతో, ఎస్సీలతో అభినాభావ సంబంధం ఉండటమే అని.అదే వెలమలకు అలాంటి సంబంధాలు లేవు అని జగ్గారెడ్డి అన్నారు.భవిష్యత్తులో రెడ్లు ఎదగకుండా తనకి అడ్డురాకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడని ఆరోపించారు జగ్గారెడ్డి

రేవంత్ రెడ్డి లాంటివాళ్ళు బహిరంగంగానే కేసీఆర్ ని విమర్శిస్తున్నారు…ఇప్పటికే కేసీఆర్ కోదండరాం ను టార్గెట్ చేయడంతో రెడ్ల సామాజిక వర్గం గుర్రుగా ఉందని.ఇప్పటికిప్పిడు కాకపోయినా కేసీఆర్ మీద అసమ్మతిగా ఉన్న వాళ్ళు అందరూ భవిష్యత్తులో కేసీఆర్ పై తిరుగుబాటు చేస్తారని.

రెడ్డి సామాజిక వర్గ నేతలు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube