సంక్రాంతికి విడుదలైన బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి బాలయ్య కేరీర్‌లోనే పెద్ద హిట్ అయ్యింది.బాలయ్య కేరీర్లో ప్రతిష్టాత్మకమైన వందో సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా బాలయ్య కేరీర్ రికార్డుగా మిగిలిపోయింది.
క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమాగా కూడా రికార్డులకు ఎక్కింది.
బాలయ్య వందో సినిమా సూపర్ హిట్ అవ్వడంతో బాలయ్య 101వ సినిమా ఏ కథతో తెరకెక్కుతుంది ? ఈ సినిమా డైరెక్టర్ ఎవరు ? అన్న ప్రశ్నలు ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్‌గా మారాయి.బాలయ్య 101వ సినిమా కోసం కృష్ణవంశీ – పూరి జగన్నాథ్ ఇలా చాలా పేర్లు వినిపించినా ఇప్పుడు ఫైనల్‌గా స్టార్ అండ్ కమర్షియల్ డైరెక్టర్ వివి.వినాయక్ పేరు వినపడుతోంది.
వినాయక్ డైరెక్షన్లో బాలయ్య 101వ సినిమా ఉంటుందంటున్నారు.గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చెన్నకేశవరెడ్డి మంచి సినిమాగా నిలిచింది.
ఇక అల్లుడు శీను – అఖిల్ ప్లాప్ తర్వాత వినాయక్ చిరు 150వ సినిమా ఖైదీ నెంబర్ 150తో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు.ఇప్పుడు ఈ క్రమంలోనే వినాయక్ చెప్పిన పవర్ ఫుల్ స్టోరీ బాలయ్యకు బాగా నచ్చినట్టు తెలుస్తోంది.
ఈ సినిమాకు బాలయ్యకు బాగా కలిసొచ్చిన రెడ్డి పేరుతోనే ఈ సినిమా టైటిల్ ఉండబోతోందని సమాచారం.బాలయ్య రీసెంట్గా ప్రకటించిన ఎన్టీఆర్ బయోపిక్ బాగా లేట్ అయ్యే ఛాన్సులు ఉండడంతో బాలయ్య ఈ గ్యాప్‌లో ఈ సినిమాను ఫినిష్ చేస్తాడని తెలుస్తోంది.