చిక్కుల్లో టీడీపీ టైగ‌ర్‌

స‌రిగ్గా ఏడాది కింద‌ట ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఇసుక కుంభ కోణానికి తెర‌తీసి.దానిని అడ్డుకున్న తాసీల్దార్ వ‌న‌జాక్షిని త‌న అనుచ‌ర‌లతో చిత‌క్కొట్టించి రాష్ట్ర వ్యాప్తంగా వార్త‌ల్లోకి ఎక్కిన టీడీపీ ఫైర్ బ్రాండ్, త‌న అనుచ‌రుల టైగ‌ర్‌గా పిలుచుకునే దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ తాజాగా మ‌రోసారి వార్త‌ల్లో వ్య‌క్తిగా మారారు.

 Reddy Appala Naidu Fires On Chintamaneni Prabhakar-TeluguStop.com

నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఇసుక‌, కాల్‌మ‌నీ, సెటిల్‌మెంట్లు వంటి దందాల‌తో కేవ‌లం రెండున్న‌రేళ్ల‌లోనే కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన చింత‌మేన‌ని ఇప్పుడు ఏకంగా టీడీపీలో ప‌ద‌వులు సైతం అమ్ముకుంటున్న‌ట్టు ఆ పార్టీకే చెందిన అధికార ప్ర‌తినిధి రెడ్డి అప్ప‌ల‌నాయుడు తీవ్ర స్థాయిలో దుయ్య‌బ‌ట్ట‌డం సంచ‌ల‌నం సృష్టించింది.

ఏలూరు మండల పరిషత్ అధ్యక్ష పదవిని కొల్లేరు గ్రామాలకు కట్టబెట్టేందుకు చింతమనేని రూ.40 లక్షలు దండుకున్నట్లుగా అప్ప‌ల‌నాయుడు ఆరోపిస్తున్నారు.2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా డబ్బులు భారీ ఎత్తున చేతులు మారాయని.దీనికి ప్రతిఫలంగా రెడ్డి అనురాధను ఏంపీపీ పదవి నుంచి తప్పించి కొల్లేరు గ్రామానికి చెందిన ఎంపీటీసీకి ఆ పదవిని కట్టబెట్టేందుకు చింతమని య‌త్నాలు చేస్తున్నార‌ని అప్ప‌ల‌నాయుడు విమ‌ర్శిస్తున్నారు.అంతేకాదు, తీవ్ర‌స్థాయిలో చింత‌మ‌నేనిపై ఫైరైపోతున్నారు.

‘‘చింతమనేని ప్రభాకర్.పిచ్చి వేషాలు మానుకో.

సామాన్య ప్రజలతో జాగ్రత్తగా వ్యవహరించాలి.అంతేకాదు.

అధికారులతో వ్యవహరించిన రీతిలో ఇష్టానుసారంగా పార్టీ నేతల్నితిట్టేస్తే ఊరుకోం’’ అంటూ వార్నింగ్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.నిజానికి చింతమనేనిని ఇప్ప‌టి వ‌ర‌కు విపక్షాలే టార్గెట్ చేసేవి.

ఇప్పుడు సొంత పార్టీ నేతే ఇలా టార్గెట్ చేయ‌డం, గ‌త చ‌రిత్ర కూడా చింత‌మ‌నేనికి వ్య‌తిరేకంగా ఉండ‌డం వంటివి ప్ర‌స్తుతం ఆస‌క్తిగా మారాయి.

నిజానికి చింత‌మ‌నేని ఇంత చేస్తున్నాడ‌ని అంద‌రికీ తెలిసినా.

రెడ్డి అప్ప‌ల‌నాయుడు మాత్ర‌మే ఇలా రెచ్చిపోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.మ‌రి ఈ విష‌యం అధిష్టానం దాకా వెళ్లి.

చంద్ర‌బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube