ఇంట్లో పుదీనా ఖచ్చితంగా పెంచుకోండి .. ఇన్నేసి లాభాలుంటాయి

పుదీనా ఆకులు మనం చాలారకలా వంటల్లో వాడతాం.కాని కేవలం రుచి కోసం వీటిని వాడతారేమో అని అనుకుంటాం.

 Reasons Why You Should Plant Mint At Your Home-TeluguStop.com

కాని పుదీనాకి హెర్బ్ అనే పేరుంది.అక్కడే అర్థం చేసుకోండి ఇది మనకు ప్రకృతి నుంచి లభించిన గొప్ప వరం అని.పుదీనాను ఇంట్లోనే పెంచుకోండి.దీన్ని పెంచడం మరీ అంత కష్టమైన పనేం కాదు.

విత్తనాలతో పెంచుకుంటారో, ఆకులతో పెంచుకుంటారో కాని, మంచి వెలుతురు, నీళ్ళు అందిస్తూ దీన్ని ప్రేమగా పెంచుకోండి.ఆ ఉద్దేశ్యం లేకపోతే కిందున్న లాభాలు చదవండి .మీరే ఆటోమెటిక్ గా పెంచుకుంటారు.

* ఆస్తమా, ఇతర శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్నవారు పుదీనాను పెంచుకుంటూ ఆ గాలిని పీల్చుకోవాలి.

ఎందుకంటే ఇందులో రోస్ మెరినిక్ ఆసిడ్ ఉంటుంది.ఇది ఇలాంటి సమస్యలతో బాధపడేవారికి ఉపశమనం అందిస్తుంది.

* రోజూ కొన్ని పుదీనా ఆకులను నములుతూ ఉంటే మీ నోట్లో బ్యాక్టీరియా చచ్చిపోతుంది.నోటి దుర్వాసన, దంతాలు దెబ్బతినడం వంటి ఇబ్బందులు ఉండవు.

* పుదీనా నుంచి వచ్చే గాలిని రోజూ పీల్చుకోవడం వలన మెదడు చురుగ్గా పనిచేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.

* పుదీనా గాలి పీల్చుకున్నా, పుదీనా తినడం వలన శరీరానికి యాంటిఆక్సిడెంట్స్, విటమిన్ సి, డి, ఈ దొరుకుతాయి.

దాంతో రోగనిరోధకశక్తి పెరుగుతుంది.

* స్నానం చేసే నీటలో పుదీనా ఆకులు వేసి, మరిగించి, ఆ తరువాత స్నానం చేస్తే చర్మానికి చాలా మంచిది.

ఇంఫెక్షన్లు, దురద లాంటి సమస్యలు పోతాయి.

* పుదీనా ఆకులని నీటిలో మరిగించి, ఆ నీటిని రోజు తాగితే తలనొప్పి, జ్వరం, జలుబు, ఇతర ఇంఫెక్షన్ల నుంచి రిలీఫ్ పొందవచ్చు.

* బరువు తగ్గాలనుకునేవారు, జీర్ణక్రియని మెరుగుపరుచుకోవాలనువారు పుదీనా గాలిని పీల్చుకోవాలి, పుదీనా ఆకులు తినాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube