చిరంజీవిని ఇప్పటి స్టార్స్ అందుకోలేకపోవటానికి కారణాలు

టాలివుడ్ సిల్వర్ స్క్రీన్ పై మూడు దశాబ్దాల క్రితం మొదలైంది మెగా స్టార్ చిరంజీవి ఏలుబడి.ఇన్నేళ్ళుగా, మెగాస్టార్ ని దాటుకోని నెం 1 దరిదాపుల్లోకి కూడా వెళ్ళిన హీరో లేడు.

 Reasons Why Chiranjeevi Is Unreachable For Present Stars-TeluguStop.com

ఒకానోక సమయంలో మెగాస్టార్ ఫ్యాన్స్ కి ముచ్చెమటలు పట్టించే ఫామ్ లోకి వచ్చిన బాలకృష్ణ వల్ల కూడా కాలేదు.తొమ్మిదేళ్ళు సినిమాలు మానేసినా, మహేష్, పవన్, ఎన్టీఆర్ లాంటి హీరోలు ఎందుకు నెం.1 గా నిరూపించుకోలేకపోయారు? మరి మెగాస్టార్ ని అందుకోవడం ఎందుకు కష్టమంటారు? కారణాలేమిటి?

* మొదటి కారణం ఆయన ఫ్యాన్ బేస్.రాజకీయాల్లో అంత దారుణంగా దెబ్బతిన్నా కూడా చెక్కుచెదరలేదు ఆయన ఫ్యాన్ బేస్.

తొమ్మిదేళ్ళు గ్యాప్ ఇచ్చి, రాజకీయాల్లో దారుణంగా ఓడిపోయాక కూడా ఇంత ఘనస్వాగతం లభించిందంటేనే అర్థం చేసుకోండి ఆయన అభిమానుల పవర్.

* యూనివర్సల్ ఫాలోయింగ్.కొందరు హీరోలు క్లాస్ ప్రేక్షకులకి నచ్చుతారు కావచ్చు, కొందరు మాస్ ప్రేక్షకులకి, కొందరు యూత్ కి, మరికొందరు ఫ్యామిలి ప్రేక్షకులకి .కాని మెగాస్టార్ అన్నివర్గాల్లో ఫాలోయింగ్ స్టార్.ఇతర హీరోలు అంత అభిమానం సంపాదించుకోవడం ఈజీ వ్యవహారం కాదు.

* చిరంజీవి సాధించినన్ని ఇండస్ట్రీ హిట్లు ఈతరం హీరోలకి సాధ్యపడే విషయం కాదు.ఏడు ఇండస్ట్రీ హిట్లు అందుకున్నారు చిరంజీవి.పవన్ – మహేష్ … ఇద్దరి ఖతాలో ఒకటే ఇండస్ట్రీ హిట్ ఉంది.

* “సినిమా ఎలా ఉన్నా చిరంజీవి కోసం వెళ్ళాలి” ఈ మాట ఎక్కువగా చిరంజీవి మీదే వాడతారు.ఖైదీనం 150 నే ఉదాహరణగా తీసుకోండి.

సినిమాకి మరీ బ్లాక్ బస్టర్ రేంజ్ టాక్ రాలేదు.అయినా వంద కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

ఎందుకంటే .జనాలకి సినిమా కంటే చిరంజీవి మీదే ఆసక్తి ఎక్కువ.మిగితా హీరోలకి ఇంత విపరీతమైన క్రేజ్ ఉందంటారా?

* చిరంజీవిలా డామినేట్ చేయడం ఇప్పటి స్టార్ హీరోలకి సాధ్యపడే విషయం కాదు.ఆ టైమ్ కొన్ని సందర్భాల్లో బాలకృష్ణ ఇచ్చిన పోటి మినహాయిస్తే, చిరంజీవికి ఎదురే లేదు.

మరి ఇప్పుడో? పవన్, మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ .అందరు రికార్డులు బద్దలుకొట్టే మొనగాళ్ళే.కాబట్టి మెగాస్టార్ లా డామినేట్ చేయడం కాని, ఆయనలా బాక్సాఫీస్ ని ఏలడం కాని, సునాయాసంగా సాధ్యపడే విషయం కాదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube