బాలకృష్ణ, అనుష్క మధ్యలో నాగార్జున..!

బాలయ్య బాబు వందవ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా రాణి పాత్రలో ముందు నయనతార అనుకున్నా అనుష్కను కన్విన్స్ చేశారట.

 Reasons Behind Anushka Out From Balakrishna 100th Film-TeluguStop.com

అదీగాక ఇలాంటి పాత్రలను హ్యాండిల్ చేయడంలో అనుష్కకు మంచి అనుభవం ఉంది.అయితే ఏమైందో ఏమో క్రిష్ ప్రపోజల్స్ కు అప్పటిదాకా ఓకే అన్నట్టు చేసిన అనుష్క సడెన్ గా చేయను అనేసిందట.

బాలయ్య సినిమా చేయను అని చెప్పిన అనుష్క నాగార్జున చేస్తున్న బాబా హతిరాం బయోపిక్ ‘నమో వేంకటేశాయ’కు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.సో బాలకృష్ణ సినిమా అనుష్క చేయకపోడానికి నాగార్జున డైరెక్ట్ గానో.

ఇన్ డైరెక్ట్ గానో కారణమయ్యాడు.

కొద్దిరోజులుగా బాలకృష్ణ, నాగార్జునల మధ్య కొద్దిపాటి గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే.

సో ఆ కారణం చేత అనుష్కను ఆ సినిమా చేయొద్దని చెప్పాడని వార్తలు వస్తున్నాయి.కాని మరో పక్క మాత్రం అనుష్కను ఫోటో సెషన్ కు పిలిపించిన క్రిష్ ఆమె ఇంకా లావు తగ్గలేదని గ్రహించి సినిమాలో రాణి పాత్రకు అనుష్క సూట్ అవదని నిర్ణయించుకుని చివరకు శ్రీయాను ఓకే చేశాడట.

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ప్రస్తుతం రెండు షెడ్యూల్ పూర్తి చేసుకుని మూడో షెడ్యూల్ కు రెడీ అవుతుంది.ఇప్పటికే బాలకృష్ణ పుట్టినరోజున వదిలిన ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ ను పండుగ చేసుకునేలా చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube