దేవునికి కొబ్బరికాయ ఎందుకు కొడతారు?

శుభకార్యాల్లోనూ, దేవుణ్ణి పూజించే సమయంలోను, యజ్ఞాలు,యాగాలు చేసే సమయంలో కొబ్బరికాయ కొట్టటం సాధారణమే.అయితే కొబ్బరికాయను అసలు ఎందుకు కొట్టాలి? ఇప్పుడు ఆ విషయాన్ని వివరంగా తెలుసుకుందాం.కొబ్బరి కాయ మీద ఉన్న పెంకు మన అహంకారానికి గుర్తు.ఎప్పుడైతే మనం దేవుని ముందు కొబ్బరికాయ కొడతామో మన అహంకారం తొలగిపోతుంది.

 Reason For Coconut Breaking In Temple-TeluguStop.com

అలాగే లోపల ఉన్న కొబ్బరి వలె మన మనస్సు స్వచ్ఛంగా ఉందని, కొబ్బరినీరు వలే జీవితాన్ని నిర్మలంగా ఉంచామని భగవంతుణ్ణి కొరటమే కొబ్బరికాయ కొట్టటంలో పరమార్ధం.

కొబ్బరికాయను మన శరీరానికి అన్వయిస్తే….

కొబ్బరికాయ మీద ఉన్న చర్మం మన చర్మం, పీచు మనలోని మాంసం, పెంకు ఎముకలు,కొబ్బరి ధాతువు,కొబ్బరినీరు మన ప్రాణాధారం.అలాగే కొబ్బరికాయ పైన ఉన్న మూడు కళ్ళు ఇడ, పింగళి,సుషుమ్న నాడులు.

అందువల్లే మనం దేవుని ముందు కొబ్బరికాయ కొడతాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube