రామోజీతో జగన్ కాళ్ళ బేరం..

కోర్టులో తమకి అనుకూలంగా తీర్పు వస్తుందని భావించిన జగన్ కి షాక్ ఇచ్చింది సిబిఐ నాయస్థానం.జగన్ అభ్యర్ధనని తోసిపుచ్చుతూ.

 Reason Behind Jagan Meets Ramoji-TeluguStop.com

మీకే మంచిది కొంచం రెస్ట్ దొరికినట్టుగా ఉంటుంది.ఈ విషయంలో మీకు వెసులుబాటు ఇవ్వడం కుదరదు అని తేల్చి చెప్పేసింది.

దీంతో వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర ప్ర‌మోష‌న్ కోసమంటూ పెద్ద‌ల‌ను క‌ల‌వ‌డం మొద‌లెట్టారు.తన పాదయాత్ర కి హైప్ క్రియేట్ చేయడానికి జగన్ అన్ని ప్రయత్నాలని చేస్తున్నాడు…తానూ ఒక వర్గానికి చెందిన వాడిని కాదు అని చెప్పడానికి.

ఇటీవలే చినజీయర్ స్వామిని కలిసిన జగన్‌….తాజాగా సోమవారం సాయంత్రం ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావును కలిశారు.

రామోజీ ఫిల్మ్ సిటీలో దాదాపు గంట పాటు వీరిద్దరి భేటీ జరిగింది.

జగన్ రెడ్డి రామోజీ ని కలవడం వెనుకాల అంతర్యం ఏమిటో ఎవ్వరికీ తెలియకపోయినా.

ఈ భేటి చాలా కీలకంగా మారిందనే చెప్పాలి.తెలుగు రాష్ట్రాలలో రాజకీయం రామోజీ చుట్టూ తిరుగుతుంది.

రామోజీ కూర్చున్న చోటునుంచే వేగంగా పావులు కదపగల సిద్ధహస్తుడు.చంద్రబాబు సక్సెస్ వెనుకాల రామోజీ హస్తం లేకుండా పోలేదు.

అలాంటి రామోజిరావుని జగన్ కలవడం రాజకీయ వర్గాలలో కలకలం రేపుతోంది.

నవంబర్ రెండు నుంచి ప్రారంభమయ్యే తన పాదయాత్ర గురించి రామోజీకి జగన్ వివరించినట్టు వార్తలొస్తున్నాయి

త‌న పాద‌యాత్ర‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని రామోజీరావును జ‌గ‌న్ ప్రాధేయ‌ప‌డిన‌ట్లు తెలిసింది.

జగన్ ఈ మధ్య రామోజీరావు తో చాల సన్నిహితంగా మెలుగుతున్నారు.ఇంత‌కుముందు కూడా ఎంపీ సుబ్బరామిరెడ్డి ఇంటి శుభకార్యానికి తొలిసారి జగన్‌, రామోజీ కలుసుకున్నారు.మళ్ళీ ఒకసారి రామోజీ ఆహ్వానం మేరకు జగన్ రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లారు.నవంబర్ రెండు నుంచి పాదయాత్ర ప్రారంభమవుతున్న నేపథ్యంలో రామోజీరావును జ‌గ‌న్ కల‌వ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

జగన్ తన పాదయాత్ర విషయంలో రామోజీరావు తో చర్చించినట్టుగా తెలుస్తోంది.రామోజీరావు కూడా విలువైన విషయాలు జగన్ కి వివరించారని సమాచారం.

అంతేకాదు తన పాదయాత్ర సమయంలో నెగ‌టివ్ వార్త‌లు రాయకుండా చూడాల‌ని కోరిన‌ట్లు జ‌గ‌న్ కోరిన‌ట్లు స‌మాచారం.ఏది ఏమైనా జగన్ చాలా ప్యుహత్మకంగా అడుగుతూ వేస్తున్నారని తెలుస్తోంది.

ఈ విషయం పై తెలుగు తమ్ముళ్ళు ఏమంటారో వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube