వర్మ చేసిన "నగ్న" సన్నివేశాల ప్రయోగం ఇండియాలో నడుస్తుందా?

“Guns and Thighs” నిన్న సాయంత్రం విడుదలైన ఈ వెబ్ సీరీస్ ట్రైలర్ పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.ఇన్నాళ్లు సెన్సార్ బోర్డు మూలాన తాను అనుకున్న కథలను అనుకున్నట్టుగా ప్రెజెంట్ చేయలేకపోయిన ఆర్జీవి, ఈసారి ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు.

 Raw, Real And —-… Rgv Strikes Big With Guns And Thighs-TeluguStop.com

ఏకంగా నగ్న సన్నివేశాలను కూడా పెట్టేసాడు.Raw and Real స్టయిల్లో నేచురాలిటి కోసం మనం ఇండియాలో ఇప్పటివరకు చూడని టేకింగ్ తో మరో కొత్త ట్రెండ్ సృష్టించాడు.

ఇంగ్లీషులో టీవీ సీరీస్ లకి వెబ్ సీరీస్ లకి చాలా డిమాండ్ ఉంటుంది.కొన్ని కొన్ని సీరీస్ లని వందల కోట్లు ఖర్చుపెట్టి తీస్తారు.

అక్కడ డిమాండ్ అంత ఉంటుంది మరి.Netflix, Amazon Video Prime లాంటి వెబ్ స్ట్రీమింగ్ యాప్స్ వచ్చాక ఇదో కొత్త ట్రెండ్ అయి కూర్చుంది.మన దేశంలో కూడా నెలకి 200-300 పెట్టి డిష్ ప్రసారాలు చూడ్డానికి కింద మీద పడేవారు కూడా నెలకి రూ.800 పెట్టి నెట్ ఫ్లిక్స్ ప్రసారాలను చూస్తున్నారు.మన సినిమాలని కోట్లలో కొంటున్నాయి ఈ సంస్థలు.బాహుబలి అనిమేటెడ్ సీరీస్ ని కోట్లు పెట్టి తీసుకుంది అమెజాన్.

ఇలాంటి ట్రెండు నడుస్తున్నా, మనవారు ఈ డిమాండ్ ని సరిగా ఉపయోగించుకోలేదు ఇప్పటివరకు.ఇంగ్లీష్ సీరీస్ లలో పెద్ద పెద్ద కథలు, నేచురల్ టేకింగ్, నగ్న సన్నివేశాలు చాలా కామన్.ఆ ఎలిమెంట్స్ ని ఇండియాలో కూడా కామన్ చేసేందుకు నడూం బిగించాడు ఆర్జీవి.4 సీజన్లు, ఒక్కో సీజన్లో 10 ఎపిసోడ్లు.ముంబై మాఫియాను కళ్ళకు కట్టినట్లు చూపించనున్నాడు వర్మ.

ఈ వెబ్ సీరీస్ ఎంత నేచురల్ గా ఉండబోతోందో ఈ ట్రైలర్ చూస్తే మీకే తెలిసిపోతుంది

ఈ సీరీస్ సక్సెస్ అయితే, భవిష్యత్తులో మనదగ్గర కూడా Dexter, Game Of Thrones, Sherlock లాంటి అద్భుతమైన సీరీస్ లు రావొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube