అదిగో మొదలవుతుంది, ఇదిగో మొదలవుతుంది అంటూ రవితేజ – దిల్ రాజు ల సినిమా అసలు మొదలే కాలేదు.రవితేజ ని కాస్త లావుగా అవ్వమని అడిగిన దిల్ రాజు మాటలు నచ్చక రవితేజ తప్పుకున్నాడు అనో, రవితేజ పారితోషికం ఎక్కువ అడిగాడు అనో ఇలాంటివి ఏవో చెప్పి మీడియా న్యూస్ రాసింది.
కానీ అసలు విషయం ఏంటి అనేది ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.
వేణు శ్రీరాం డైరెక్షన్ లో తెరకెక్కాల్సిన ఎవడో ఒకడు దిల్ రాజుతో పాటు రవితేజకు కూడా బాగా నచ్చింది.
ఎవరికైనా సూట్ అయ్యే ఈ కథను.తనే చేస్తానని మాస్ మహరాజ్ గతంలో చెప్పాడట.
అందుకే ఇన్నాళ్లు వెయిట్ చేసినట్లు చెప్పుకుంటున్నారు.కానీ ఎక్కువ అంటే మరీ ఎక్కువగా పారితోషికం కావాలని రవితేజ పట్టుబట్టాడట.
ఏకంగా 9 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తేనే ప్రాజెక్టు ముందుకు కదులుతుందని రవితేజ చెప్పాక.మార్కెట్ కు తగ్గట్లుగా తీసుకోవాలని దిల్ రాజు చెప్పాడని అంటున్నారు.
ఆరుకోట్లకి కాస్త అటూ ఇటూ అయినా రవితేజ మాత్రం తాను అనుకున్న రెమ్యునరేషన్ కి పైసా తగ్గేది లేదు అని తెగేసి చెప్పడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది అంటున్నారు.ఒక మంచి స్టోరీ ని రవితేజ తన డబ్బు పిచ్చి కోసం వదులుకున్నాడు అని ఇండస్ట్రీ లో గుస గుసలు వినిపిస్తున్నాయి.
రవి నిజంగా అలా చేసి ఉంటాడు అని మీరు అనుకుంటున్నారా ? సింధూరం , ఖడ్గం లాంటి సినిమాలు చేసినోడు డబ్బుల దగ్గర ఇంత హైరానా పడతాడా?
.