మాస్ మహరాణి అనేయొచ్చా మరి..!

అదేంటి మాస్ మహరాజ్ ఉన్నాడు కదా కొత్తగా ఈ మాస్ మహరాణి ఏంటి అంటే.సక్సెస్ ఫుల్ కెరియర్ తో సూపర్ జోష్ లో ఉన్న రాశి ఖన్నా అనతి కాలంలోనే స్టార్ ఇమేజ్ సంపాదించింది.

 Rashi Khanna In Mass Avatar-TeluguStop.com

అయితే తన అభిమానులు ఇంకా తనను కొత్త యాంగిల్ లో చూడాలనుకుంటున్నారట.కొందరైతే తనను ఊర మాస్ క్యారక్టర్స్ చేస్తే బాగుంటుంది అంటున్నారట.

మొదట్లో ఊర మాస్ క్యారక్టర్స్ అంటే తనకు అర్ధమయ్యేది కాదని చెప్పిన రాశి సుప్రీలో బెల్లం శ్రీదేవి లాంటి పాత్రలేనా ఊర మాస్ అంటే అని అర్ధం చేసుకుంది.

అయితే తనకు పర్సనల్ గా మాత్రం క్లాసిక్ సినిమాల్లో నటించడమే ఇష్టం అంటుంది రాశి ఖన్నా.

గీతాంజలి లాంటి ఫీల్ గుడ్ మూవీస్ లో చేయాలని రాశి కోరికట.ఇక తన కోరిక ఎలా ఉన్నా ఆడియెన్స్ తనను మాస్ మహరాణిగా చూడాలనుకోవడం తనకు సంతోషంగా ఉంది అంటుంది.

సుప్రీమ్ సినిమాలో తన పాత్ర తన కెరియర్లోనే చాలా స్పెషల్ అంటూ చెప్పుకొచ్చిన ఈ భామ ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో తన ఆనందానికి అవధుల్లేవని అంటుంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube