ఇద్దరు హీరోయిన్లకు లైన్ వేస్తున్న హీరో

బాలివుడ్ చాక్లేట్ బాయ్ రణ్బీర్ కపూర్ రోమాంటిక్ లైఫ్ గురించి కొత్తగా చెప్పేదేముంది.ఇలా వచ్చిరాగానే తన తొలిచిత్రం హీరోయిన్ సోనమ్ కపూర్ తో ప్రేమాయణం నడిపి తనని వదిలేసిన ఈ కుర్రహీరో, ఆ తరువాత దీపికా పదుకోణేని పీకల్లోతు ప్రేమలో ముంచాడు.

 Ranbir Kapoor’s Romantic Trails On Anushka And Jacqueline?-TeluguStop.com

కొన్నాళ్ళ పాటు సందడి చేసిన ఈ జంట ఆ తరువాత విడిపోయారు.

ఆ తరువాత కత్రీనా కైఫ్ తో సంవత్సరాలపాటు చక్కర్లు కొట్టి, పెళ్ళి దాకా తీసికెళ్ళి, తనకి కూడా హ్యాండ్ ఇచ్చేశాడు.

పాపం కత్రీనా, ఏకంగా సల్మాన్ ఖాన్ నని వదిలేసుకోని వచ్చింది అప్పట్లో.ఇన్నిసార్లు బ్రేక్ అప్ చెప్పిన తరువాత కూడా ఈ రొమాంటిక్ హీరో కుదురుగా ఉండట్లేదట.

మరో హాట్ బ్యూటి జాక్వెలీన్ ఫెర్నాండెజ్ కి రొమాంటిక్ సందేశాలు పంపుతూ బాగా ట్రై చేస్తున్నా, ఆ ముద్దుగుమ్మ అస్సలు పడట్లేదట.అటువైపు ప్రయత్నాలు చేస్తూనే, ఇప్పుడు తనతో పాటు ఐ దిల్ హై ముష్కిల్ లో నటించిన అనుష్క శర్మపై కూడా కన్నేశాడట రణబీర్.

సాక్షాత్తు విరాట్ కొహ్లీ గర్ల్ ఫ్రెండ్ ని వదలట్లేదు అంటే రణబీర్ మామూలోడు కాదు అని కామెంట్ చేస్తున్నారు బాలివుడ్ జనాలు.మరి ఈ ఇద్దరిలో ఎవరిని పడేయటంలో సఫలం అవుతాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube