రానాకు దక్కింది

టాలీవుడ్‌ టాల్‌ హీరో రానా ఇక్కడ పెద్దగా ప్రభావం చూపించకున్నా, బాలీవుడ్‌లో మాత్రం మంచి గుర్తింపును తెచ్చుకుంటున్నాడు.ఈయన ఇప్పటికే బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించి మెప్పించాడు.

 Rana Daggubati Stands Top Place In Celebrity Survey In Bollywood-TeluguStop.com

తాజాగా ‘బాబీ’ సినిమాతో హిందీ ప్రేక్షకుల ముందుకు వెళ్లిన రానాకు మరోసారి మంచి మార్కులు పడ్డాయి.తాజాగా టైమ్స్‌ నిర్వహించిన సెలబ్రెటీ సర్వేలో బాలీవుడ్‌ స్టార్స్‌ లిస్ట్‌లో రానా చేరిపోయాడు.

అది కూడా టాప్‌`10 జాబితాలో.ముంబైలో సెలబ్రెటీల జాబితా తీస్తే ముందు వరుసలో మనోడు ఉన్నాడు.

అమీర్‌ ఖాన్‌, రణబీర్‌ కపూర్‌ల కంటే కూడా సెలబ్రెటీగా మన రానా ముందు ఉన్నాడు.అంటే అర్థం చేసుకోవచ్చు రానా అక్కడ ఎంతగా సెలబ్రెటీ హోదాను అనుభవిస్తున్నాడో.

అక్షయ్‌ కుమార్‌ మొదటి స్థానంలో ఉండగా, షారుఖ్‌ రెండవ స్థానం, అమితాబచ్చన్‌ మూడవ స్థానం, అర్జున్‌ కపూర్‌ నాల్గవ స్థానం, సల్మాన్‌ ఖాన్‌ అయిదవ స్థానం, రానా ఆరవ స్థానంలో ఉన్నాడు.ఇటు తెలుగులో కూడా రానా త్వరలో రెండు సినిమాలు విడుదల చేయబోతున్నాడు.

‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ సినిమాల విడుదల తర్వాత రానా క్రేజ్‌ టాలీవుడ్‌లో కూడా పెరుగనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube